పల్లె ప్రగతి హడావుడి చేసే ప్రతినిధులారా..సర్పంచుల బాధలు వినగలుగుతారా….

0
TMedia (Telugu News) :
s s consultancy

పల్లె,పట్టణ ప్రగతి అని హడావుడి చేసే ప్రజా ప్రతినిధులారా…..
సర్పంచుల బాధలు ఒకసారి వినగలుగుతారా….
టీ మీడియా న్యూస్,జూన్ 26, మధిర:
మధిర మండలం సైదల్లీ పురం గ్రామ సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు మాట్లాడుతూ…….. గ్రామంలో వెకుంఠధామం పూర్తి చేయలేదని, పల్లె ప్రకృతి వనం బాగా లేదని, చెత్త సేకరణ తడి చెత్త పొడి చెత్త చేయట్లేదని ఇబ్బంది పెడుతున్నారు ఇంత హడావుడి చేసే నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మానసికంగా రాతపూర్వకంగా సర్పంచులను బెదిరించి గత సంవత్సరం చేసిన పనులకు నిధులు ఇవ్వనిది కాక ప్రతి ఒక్క సర్పంచ్ రాష్ట్రంలో ఎంతో కొంత స్థిరాస్తులు ఉంటే అమ్ముకొని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఉన్నది అమ్ముకొని పదవి ఉన్నదని పదవి అయిపోయిన తర్వాత ఏమి లేకుండా అయిపోతుంది అమ్ముకోవడానికి కూడా తినటానికి కూడా ఏమీ లేకుండా అయిపోతుంది దీనిని గమనించి సర్పంచుల బిల్లులు ఇవ్వడంలేదని ఎందుకు ఇవ్వరని అని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి సర్పంచులను అప్పుల ఊభి నుంచి బయటకి ఏసి జనాభా లో తిరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికార ప్రభుత్వానికి ఉన్నది కావున అందరి బిల్లులు అర్జెంటుగా ఇస్తే ఏదోరకంగా కుటుంబం గడవడానికి ఉపయోగపడుతుంది . ప్రస్తుత పరిస్థితిలో అప్పు పుట్టక సర్పంచులకు చాలామంది బాధపడుతూ ఉన్నారు.దీనిని గమనించిన అధికార పార్టీ ఇప్పుడు హడావుడి చేసే విధంగా బిల్లులు ఇప్పింఛగలరు అని సర్పంచ్ కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.