విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం..పదవి గ్రహీతలకు సన్మాన మహోత్సవాలు,

0
TMedia (Telugu News) :
s s consultancy

(టీ మీడియా ప్రతినిధి మొగుళ్లపల్లి జూన్ 29 )విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన జిల్లాస్థాయి మండలస్థాయి కమిటీ బాధ్యులను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయనున్న జనరల్ బాడీ సమావేశంలో నూతన పదవి గ్రస్తులకు సన్మానం మహోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎరోజుల భిక్షపతి తెలిపారు మంగళవారం ఆయన విలేకరితో మాట్లాడుతూ ఇటీవల ఎన్నుకోబడిన జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను విశిష్ట అతిథులు సమక్షంలో వారిని సన్మానించడం జరుగుతుందని సభా వేదిక తేదీలను త్వరలో ప్రకటించి కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు భిక్షపతి తెలిపారు అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా కమిటీలతో పాటు యూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి మహిళలతో పాటు యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి వారికి తగిన గౌరవం రాష్ట్ర నాయకత్వం కల్పిస్తుందని విశ్వబ్రాహ్మణల ఐక్యతతో వారికి రావలసిన హక్కులను న్యాయమైన శాంతియుత పోరాటాలతో సాధించుకోవాలి అని ఆయన తెలిపారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.