నల్లగొండలో కోవిడ్-19పై సమీక్ష

0
TMedia (Telugu News) :

నల్లగొండలో కోవిడ్-19పై సమీక్ష
హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

s s consultancy

టి-మీడియా/నల్గొండ(12):
*ప్రాథమికఆరోగ్యకేంద్రాలలోను ఐసోలేషన్ కేంద్రాలు
*24*7కేంద్రాలకు సరిపడా ఆక్సిజన్
*కోవిడ్ కు మందు దైర్యమే
*రేమిడిసివర్ కొరత లేకుండా ఏర్పాట్లు
*అవసరమున్న చోట మాత్రమే వాడండి.

ప్రాథమికఆరోగ్యకేంద్రాలలోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు.247 నడిచే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో సరిపడా అక్షిజన్ సరఫరా చేయాలని ఆయన కోరారు.నల్లగొండ జిల్లాలో 247 నడిచేవి 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు బుధవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్-19పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 24/7 నడిచే 18 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.అందులో
చండూరు,చిట్యాల,కనగల్,కేతేపల్లిమునుగోడు,శాలిగౌరారం,తిప్పర్తి, దామరచర్ల,హాలియా, నిడమనూర్,పెద్దవూర,వేములపల్లిలతో పాటు డిండి,గుడిపల్లి,
గుర్రంపోడు,కొండ మల్లెపల్లి ,మర్రిగూడ,నాంపల్లి
పి.ఏ పల్లి తదితర మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఇక పై కోవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలకు మంజూరు ఆయిన రేమిడిసివీర్ ఇంజెక్షన్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.
అవసరమైన మెడిసిన్ ఇండెంట్ పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు ఆయన సూచించారు.
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అన్ని వెంటిలేటర్లు పనిచేసే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు.కోవిడ్ పేషంట్లకు ధైర్యమే మందు అని ఆ ధైర్యమే వైద్యులు,వైద్యశాఖా సిబ్బంది పేషేంట్ల కు అందించాలని ఆయన కోరారు. మనోధైర్యనికి మించిన మందు లేదు అన్న సందేశం ప్రజల్లోకి పంప గలిగితే కోవిడ్ పేషేంట్ల ను కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 4 లక్షల 50 వేల 895 శాంపిల్స్ సేకరించగా 40,696 మందికి పాజిటివ్ సోకినట్లుగా గుర్తించినట్లు ఆయన వివరించారు. అందులో 10,290 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 703 మంది ఆయా ఆసుపత్రిలలో చికిత్సలు పొందుతున్నారన్నారు. జిల్లాలో 1400 టీం లను ఏర్పాటు చేసి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 72.64 శాతం రికవరీ ఉందని 29,560 మంది పూర్తిగా కొలుకున్నారన్నారు. మొత్తం పాపులేషన్ లో 25.87 శాతం టెస్ట్ లు చేయగా 9.03 శాతం పాజిటివ్ గా నమోదు అవుతున్నారన్నారు.
రేమిడిసివీర్ పేరుతో ఎక్కువ మొత్తం వసూలు చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు.కోవిడ్ ను గుర్తించినంత మాత్రాన ఆందోళన పడొద్దని వైద్యుల సలహాలు పాటిస్తే రికవరీ కావొచ్చు అన్నది రుజువు అవుతుందన్నారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,డి.ఐ.జి ఏ.విరంగనాధ్,
జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యశాఖాధికారి కొండల్ రావు,జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండేంట్ జైసింగ్ రాథోడ్ డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ మాతృ తదితరులు పాల్గొన్నారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.