కోవిడ్ పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం

0
TMedia (Telugu News) :

కోవిడ్ పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం
టి-మీడియా/సూర్యాపేట(మే-7):-

s s consultancy

ఆక్సిజన్ కు కొరత లేదు, 247 వైద్యశాలలో అందుబాటులో ఆక్సిజన్.
*రేమిడిసివర్ గురించి అనవసరంగా ఆందోళన చెందకండి.
*పకడ్బందీగా ఇంటింటా సర్వే
*అనుమానితులు ఐసోలేషన్ కు వెళ్ళాలి.
*అందుబాటులో కరోనా కిట్లు.
*వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది.
*యాప్ లో నమోదు ఆధరంగానే వ్యాక్సిన్ టీకాలు.

తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ ఉధృతిని అరికట్టేందుకు పాఠించల్సిన చర్యల గురించి మంత్రి జగదీష్ రెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని ఆయన చేశారు.24/7 నడిచే అన్ని ఆరోగ్య కేంద్రాలలో అక్షిజన్ అందుబాటులో ఉంటుందని ప్రజలు ఎలాంటి భయందోళలకు గురి కావద్దని సూచించారు. రేమిడిసివర్ గురించి అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని ఆయన ప్రజలకు విజ్ణప్తి చేశారు కరోనా నివారణకు అదొక్కటే మందు కాదని ,అదొక మందు మాత్రామే నని ఆయన తేల్చిచెప్పారు. కోవిడ్ పై అనుసరించాల్సిన విధి విధానలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఉపద్రవృన్నయినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కరోనా అనుమానం వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అదే సమయంలో అనవసరంగా భయాందోళనకు గురి కావొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ సరఫరా విషయం పై ఆయన స్పందిస్తూ వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని వారు రూపొందించిన యాప్ లో నమోదు చేసుకున్న ప్రకారం క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు,స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ,డి.యం&హెచ్.ఓ కోటాచలం, మెడికల్ కళాశాల సూపరెండేంట్ డాక్టర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(వెంకట్ బెజవాడ, టి-మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.