ఈడీ ముందు హజరు కు సమయం కోరిన ఎంపి నామ

0
TMedia (Telugu News) :

ఈడీ ముందు హజరు కు సమయం కోరిన ఎంపి నామ

s s consultancy

టీమీడియా హైదరాబాద్;
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్‌ రుణాల కేసులో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారంఈడీ ముందు విచారణకు హాజరు కాలేదు.నామ సీతయ్య,పుద్వితేజ,శ్రీనివాసరావు హాజరయ్యారు.

గతంలో ఆయన కార్యాలయాలు, నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ.. వాటిపై విచారణ కోసం ఇవాళ తమముందు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది. అయితే తాను ఇవాళ విచారణకు హాజరుకాలేనని మరికాస్త సమయం కావాలని ఆయన ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో నామాకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేయనుంది. అసలు..ఏం.. జరిగిందంటే..?! తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై మనీలాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసు నమోదు చేసింది. జూన్​ 11న నామాతో పాటు రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిడెట్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కెనరా బ్యాంకు కన్సార్టియం నుంచి సుమారు వెయ్యి కోట్ల రూపాయల రుణాలు పొంది… నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని అభియోగం. జార్ఖండ్​లో రాంచీ నుంచి జంషెడ్ పూర్ వరకు 1151 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టును మధుకాన్ ప్రాజెక్ట్స్ 2011లో దక్కించుకుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.