సమస్యలను సత్వరమే పరిష్కరించాలి -మంత్రి కొప్పుల

గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపట్టాలి

0
TMedia (Telugu News) :

రామగుండం ప్రాంతంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

పల్లెప్రగతి,హరితహారం కార్యక్రమంలో స్థానిక కమిటిలను భాగస్వామ్యం చేయాలి

టీ మీడియా,జగిత్యాల:

ministoer revie with ofisiels
potispeted ofisiyels

ఎన్టీపీసీ మిలినియం హాల్లో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.అటు తర్వాత ప్రజా ప్రతినిధులు,అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read: సీఎస్ సోమేశ్‌పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

s s consultancy

శనివారం ఎన్టీపీసీలోని మిలినియం హల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 57,494 మంది రైతుల నుంచి 678.08 కోట్ల రూపాయల విలువ గల 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధర పై కోనుగోలు చేసామని మంత్రి తెలిపారు

Also Read:  నిరంజన్ రెడ్డి  క్షమాపమంత్రిణ చెప్పాలి..

. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ధాన్యం కోనుగొలు చేస్తున్నప్పటికి కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని,వాటిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం జిల్లాలో త్రాగు నీటి సరఫరా అంశంపై మంత్రి చర్చించారు.మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలని,దానికి అవసరమైన నిధులు సైతం వెంటనే అందిస్తామని తెలిపారు. జిల్లాలో అటవీ భూములు, రెవెన్యూ భూములకు మరియు అటవీ భూములు, ప్రైవేటు భూముల మధ్య ఉన్న వివాదాలపై నివేదిక సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read:24వ డివిజన్ల్లో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం

జిల్లా యంత్రాంగం అందించే నివేదిక ఆధారంగా జాయింట్ సర్వే చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతులకు వానాకాలం రైతు బంధు నిధులను 137.09 కోట్ల రూపాయలు విడుదల చేసామని మంత్రి తెలిపారు.జిల్లాలోని గ్రామాలో పల్లె ప్రగతి పెండింగ్ పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని,గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.పారిశుద్ద్య నిర్వహణ పై అధిక శ్రద్ద వహించాలని సూచించారు. గ్రామాలలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా మొక్కలను నాటామని,3 శాతం మేర గ్రీన్ కవర్ వృద్ది చేసుకున్నామని మంత్రి తెలిపారు.హరితహారం కింద నాటే మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read:కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ

రామగుండం ప్రాంతంలో అధికంగా పరిశ్రమలు ఉన్నాయని,వాటి వల్ల కాలుష్యం అధికమౌ తున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు.సింగరేణీ పరిశ్రమకు అధిక మొత్తంలో మొక్కల నాటి, వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని,100 శాతం మొక్కల సంరక్షణ జరిగే విధంగా కార్యచరణ రుపొందించి అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.రామగుండం ప్రాంతంలో ఉన్న గోదావరి నదీ ప్రవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని,అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను ఫిబ్రవరి మాసం నుంచి తొలగించాలని, వచ్చే సంవత్సరం అక్కడ లక్షల మొక్కలు నాటేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.గ్రామాలో కనీస అవసరాలు అందించే దిశగా స్మశానవాటిక, డంపింగ్ యార్డు,ట్రాక్టర్,నర్సరీ వంటివి సమకూర్చుకున్నామని మంత్రి తెలిపారు.గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు ప్రస్తుతం పూర్తి చేయాలని మంత్రి సూచించారు.జిల్లాలో పెండింగ్ లో ఉన్న 6 స్మశానవాటిక నిర్మాణ పనులకు ప్రత్యాహ్నమయ ప్రణాళిక రూపొందించి పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలని,ఇంటి పై నుండి వెళ్లే హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.హరితహారం,పల్లెప్రగతి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు స్థానిక కమిటిలను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించి, ప్రజాభాగస్వామ్యంతో మాత్రమే ఆదర్శ గ్రామాలను తయారు చేయవచ్చని మంత్రి తెలిపారు.దళితుల కోసం సీఎం కేసిఆర్ ప్రత్యేకంగా దళిత సాధికారత పథకాన్ని ప్రారంభించారని,వచ్చే సంవత్సరం లబ్దిదారుల సంఖ్య గణనీయంగా పెంచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసుకుందామని సీఎం తెలిపారని,దాని కోసం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది.ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్,ప్రభుత్వ విప్ ఎమ్మేల్సీ టి.భానుప్రసాద్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,డిసిఎమ్మెస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్,అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు,సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.