తాగునీటి సమస్య పరిష్కరించండి

0
TMedia (Telugu News) :

తాగునీటి సమస్య పరిష్కరించండి

s s consultancy

టి-మీడియా (మే15) కర్నూలు జిల్లా మహానంది

మహానంది మండలం బొల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో సుబ్బరాజుకు ఫిర్యాదు.
గ్రామంలోని బిసి కాలనీ యందు తాగునీటి సమస్య తలెత్తిందని పరిష్కార దిశలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు .పైప్ లైన్ ఉన్న తాగునీరు అందడం లేదని మరియు కాలనీలో కొంత భాగం పైప్ లైన్ కూడా లేదని తాగునీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంపీడీవో సుబ్బరాజు కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లేదా మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆర్డబ్ల్యూఎస్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు స్వతహాగా పైపులు కొన్ని వేసుకున్న ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు అడ్డు చెప్పరని గ్రామస్తులకు తెలిపారు .ఇళ్ల వద్ద తాగునీటి కుళాయిలకు విద్యుత్తు మోటార్లు బిగించి అక్రమంగా నీటి వినియోగాన్ని సహించబోమని హెచ్చరించారు.
అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పేర్కొన్నారు.ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడి సత్వరం చర్యలు తీసుకునేందుకు పాటు పడతా మన్నారు మండల పరిధిలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు గ్రామాల్లో సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని వాటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
స్థానికంగా ఉన్న గ్రామ వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు తాగునీరు ఇతర మౌలిక వసతుల పై ప్రత్యేక సారించి సమస్యలు ఏవైనా ఉంటే తమకు తెలియజేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.