ఎన్నారైల, వాసవి మిత్రుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

ఎన్నారైల, వాసవి మిత్రుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.

s s consultancy

కుటుంబానికి 3 వేల విలువగల సరుకులు అందజేత.

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట,మంచిర్యాల జిల్లా మే 22
సంపాదనే ముఖ్యం కాదని, తమ సంపాదనలో పేదలకు సహాయం అందించినప్పుడే ఎవరికైనా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేటలోని హనుమాన్ ఆలయ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద ఆర్యవైశ్య, బ్రాహ్మణ నిరుద్యోగుల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అమెరికాలోని ఎన్ఆర్ఐ వాసవీ మిత్రుల సహకారంతో ఒక కుటుంబానికి రూ.వెయ్యి నగదు తో పాటు రూ.3వేల విలువ గల ఆ సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అమెరికాలో ఉంటున్న మిత్రులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నారైలు హనుమాన్ నందనం పాటి, శ్యామ్ పడమటఅంటీ , కాసం గణేష్ గుప్తా, కాసం అశోక్ గుప్తా, కాసం రాజేష్ గుప్తా, రాజేష్ బిల్ధె, రామకృష్ణ నరేందుల లు ఈ సహాయాన్ని అందించారు, ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైఎస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ,ఆర్యవైశ్య సంఘం నాయకుల గుండా సత్యనారాయణ, చెట్ల రమేష్, మైలారపు సుధాకర్,వొజ్జల శ్రీనివాస్ , నలమాస్ శ్రీనివాస్, సాయిని సుధాకర్, గడ్డం వికాస్ కటకం రమేష్, చింతల రంజిత్, బొద్దుకూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.