నిబంధనలు పాటిస్తూ రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలి.ఏసీపీ అఖిల్ మహాజన్

0
TMedia (Telugu News) :

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలి.మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట,మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల సబ్ డివిజన్ లోని లక్షెట్టిపేట్ లో ఉన్న ముస్లిం మత పెద్దలతో మరియు పీస్ కమిటీ మెంబర్లతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ….. భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం విరాజిల్లుతున్నదని, ఒక మతాన్ని ఇంకో మతం వారిని ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మన మంచిర్యాల జిల్లాలో ఉన్నదని, అన్ని మతాల సారం ఒక్కటేనని తెలిపారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలు జరుపుకోవాలని. ఎవరి ఇళ్లల్లో వారు పండుగలు జరుపుకోవాలని సూచించారు. కరోనా వ్యాధి నివారణకు కృషి చేయాలని తెలిపారు. ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరు మాస్కు ధరించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవరకు మాస్కు తీయవద్దన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు.కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మాస్కు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై, లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్, లక్షెట్టిపేట్ ఎస్ఐ చంద్ర శేఖర్, దండపల్లి ఎస్ఐ శ్రీకాంత్, జన్నారం ఎస్ఐ ఆది మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.