పగిలిపోయిన ఆర్ అండ్ బి తారురోడ్డు

ప్రారంభించిన నెలరోజులకే పగిలిపోయిన ఆర్ అండ్ బి తారురోడ్డు.... నాణ్యత ప్రమాణాలు పాటించని అధికారులు...

0
TMedia (Telugu News) :

ప్రారంభించిన నెలరోజులకే పగిలిపోయిన ఆర్ అండ్ బి తారురోడ్డు…. నాణ్యత ప్రమాణాలు పాటించని అధికారులు…

 

 

 

road seeing
road seeing cpi leader

టీ మీడియా న్యూస్, మధిర టౌన్, జూలై 25:
మధిర మండలం లోని దెందుకూరు నుండి అంబారుపేట మీదుగా మాటూరుపేట వరకూ 8 కోట్ల రూపాయలతో ఆయా గ్రామాల రైతులకు ఉపయోగపడేలా ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణ లో తారు రోడ్డు నిర్మించారు. గత నెల 25 న దానిని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

s s consultancy

Also Read:23 వ డివిజను లో వృక్షార్చన

కానీ ప్రారంభించిన నెలరోజుల లోపే రోడ్డు పై అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడటం చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుందని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి విమర్శించారు. మధిరలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న పనులు కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు (ఆర్ధికపరంగా )వరంలాగా ప్రజలకు శాపం లాగా మారిందని విమర్శించారు. అలాగే దేశినేనిపాలెం నుండి ఇల్లూరు వరకూ తారు రోడ్ కూడా రైతులకు ఉపయోగపడే రోడ్డు కానీ దేశినేనిపాలెం ఊరి మొదట్లో నిర్మించాల్సిన కల్వర్టును పూర్తి చేయకపోవడం వలన రైతులకు వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బంది కల్గుతుందని కావున అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతుల పక్షాన బెజవాడ రవి డిమాండ్ చేశారు.

Also Read:హుజురాబాద్ బరిలో జూలూరుపాడు వాసి

అస్సలు మధిర ప్రాంతంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనులను చేసే కాంట్రాక్టర్లు అధికారులు చెప్పినట్లు చేస్తున్నారా లేకపోతే కాంట్రాక్టర్లు చెప్పినట్లు అధికారులు వింటున్నారా అని,
త్వరలో కలసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని మధిర ప్రాంతంలో జరిగే అన్ని పనులను వాటి నాణ్యతను పరిశీలించి ప్రజా ధనం దుర్వినియోగంగా నాశిరకంగా ఉన్న వాటిని గుర్తించి ఖమ్మం జిల్లా కలెక్టర్ను అఖిల పక్ష రాజకీయపార్టీ నాయకులతో కలసి అభివృద్ది ముసుగులో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, అలాగే నాసిరక నిర్మాణాలకు కారకులైన
సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని కోరానున్నామని ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.