రైతు సంక్షేమం లక్ష్యం గా పని చేస్తున్నము..టీమీడియా తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం

0
TMedia (Telugu News) :

రైతు సంక్షేమం లక్ష్యం గా పని చేస్తున్నము

-పాలక వర్గం,వ్యాపారులు, కార్మికుల నుండి పూర్తి సహకారం

-4000వేల మందికి వ్యాక్షన్ వేయించాము

టీమీడియా తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం


బడి పంతులు ఉద్యోగం ఉన్న వదిలేసి గ్రూప్స్ రాసి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అయ్యారు.12 ఏళ్ళు సుదీర్ఘ అనుభభం ఉంది..అయిన ఉదయాన్నే మార్కెట్ యార్డ్ లో కనిపిస్తారు.9గంటల వరకు ధరలు బైట ప్రపంచానికి తెలుపుతారు.అటుతరువాత ఛాంబర్ కి చేరుకొని అఫిస్ పని చేసుకొంటా రు. అలసట అనేది ఆయన మొహం లో కనిపించదు..ఒకప్పుడు రాష్ట్ర వ్యాపిత చర్చకు కారణం అయిన ఖమ్మం మార్కెట్ లో ఈసీజన్ లో చిన్న సంఘటన లేదు…ఆదాయం కు కొదవలేదు. ఏమిజరుగుతోంది అన్నవిషయాలు గురించి టీమీడియా కి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం ఇంటర్యూ ఇచ్చారు.. ఇంతటి విజయాలకు బలం,బలహీనత అంత పాలక వర్గం,వ్యాపారులు,కార్మికులు అందరి సమిష్టి కృషి అన్నారు.

ప్ర;మార్కెటింగ్ శాఖ లో ఉద్యోగం ఎలా..?

జ:నేను మొదట ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.. వ్యవసాయ రంగం,రైతులు పై ఉన్న మక్కువ .తో టీచర్ ఉద్యోగానికి సెలవు పెట్టి చదివి గ్రూప్స్ రాసి ఇటు వైపు వచ్చాను

ప్ర;మల్లేశం గారు ఎక్కడ పని చేసిన పని రాక్షసుడు అంటారు .ఆ మాటకు వస్తే నేను ఒక్కడిని కాను మా ఛైర్మెన్ గారు,వైస్ చైర్మన్ గారు పాలక వర్గం,వ్యాపారులు, సిబ్బంది అందరూ పనిమంతులు.వారి లో నేను ఒకడిని.అందరి మధ్య మంచి సమన్వయ ము ఉంది.

ప్ర:మార్కెట్ ఆదాయం ,పరిస్థితి .?

జ:తెలంగాణ లో అతి పెద్ద మార్కెట్ ఖమ్మం. ఏడాది కి 20 కోట్లు ఆదాయం.పూర్తి స్థాయి కంప్యూటరికరుణ అయిన మార్కెట్, సీజన్ లో 200లకోట్లు వ్యాపార లావాదేవీలు నిర్వహిండం.కొనుగోలు చేసిన రోజే రైతులకు వ్యాపారులు చెలింపు లు చేస్తున్నరు,మార్కెట్ లోకి ప్రవేశించగానే రైతుకు కంప్యూటర్ ఎంట్రీ స్లీప్ ,తూకం వేయగానే కంప్యూటర్ స్లిప్ ,10వేల కుటుంబాలకు ఉపాధి ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్కెట్ కి ఉన్నాయి.

s s consultancy

ప్ర: ఖమ్మం మార్కెట్ కు సీజన్ లో గొడవలు ప్రత్యేకత ఉంది..?
జ:నేను విన్న గతం లో ఏమి జరిగాయి తెలియదు..ఈ సీజన్ లో చిన్న గొడవ అనేది లేదు.రైతులు హ్యాపీ, వ్యాపారులు, కార్మికులు హ్యాపి గా ఎవరి పని వారు చేసుకు పోతున్నారు.కరోన కష్ట కాలం లోను ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోతున్నము.

ప్ర:ఇంతటి హ్యాపీ కి కారణం..?

జ;మొదటిది ఉన్నది రైతు ప్రభుత్వం.మాపాలకవర్గం రైతు కుటుంబాల వారు,ఉన్న 470 మంది కమిషన్ దారులు,245 మందిట్రేడర్లు కు ,కార్మికుల కు రైతులకు మధ్య ఉన్న అనుబంధం విడతీయ రానిది..నా 12 ఏళ్ల సర్వీస్ లో రైతులు వివాస్పద చర్యలకు మార్కెట్ లో పునుకొన్నది లేదు అదే వాతావరణం ఇక్కడ ఉంది..నాతో పాటు అన్ని విభాగాల వారి మధ్య సమన్వయం ఉంది..చిన్న ,చిన్న విషయాలు గురించి చర్చించ డానికి వ్యాపారులు, కార్మికులు రైతుల తో చైర్మన్ గారు ఇతర పాలక వర్గం వారు 20 సార్లు ఇప్పటికి ముందస్తు భేటి లు జరిగాయి.ఎప్పటి వి అప్పుడే పరిష్కరించు కొన్నాము.ముందుకు పోతున్నాము.

ప్ర:కరోన విత్కర పరిస్థితి ఎలా ఎదుర్కొన్నారు..?

జ;నేను ముందు చెప్పినట్లు వడ్డించే వారు మన వాళ్ళు అన్నట్లు గా.రైతు ప్రభుత్వం తెలంగాణ లోఉంది మంత్రి అజయ్ కుమార్ గారి ప్రత్యేక దృష్టి ఆదేశాలు తో. మార్కెట్ లో ఉచిత బోజ న సదుపాయము లాక్డోన్ లో కల్పించాము.పంట నిల్వ చేసిన రైతుల కు 7 కోట్లు ఉత్పత్తులు పై 6నెలల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చాము.4 వేల మందికి వ్యాక్షన్ మొదటి డోస్ వేయించాము .కరోన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసాము చేస్తున్నము.

ప్ర:రైతుల కు సందేశం..?

జ;మార్కెట్ బైట దళారులకు సరుకు అమ్ముకోవద్దు. మార్కెట్ కు రండి మేమున్నాం.. లోనికి వచ్చే ముందు పెరు న మోదు చేయించు కొని కంప్యూటర్ స్లిప్ తీసుకోండి సరుకు అమ్మి తూకం వేయగానే అక్కడ కంప్యూటర్ స్లిప్ తీసుకోండి మీ పేరున .మార్కెట్ లోపలమీ కు,ప్
మీ సరుకుకు ,మీవ్యక్తిగత భద్రత మేము బాధ్యత వహిస్తాము.ఏ చిన్న ఇబ్బంది .చెల్లింపులు,తూకం.ఇతరత్ర వచ్చిన మేము సహాయం చేస్తాము..

ప్ర;మార్కెట్ వాతావరణం ఇంత మంచిగా ఉండ డానికి..?

జ;పైన చెప్పాను. ఒకటి ఏక పక్ష నిర్ణయం లు లేవు .సమిష్టి గా చర్చించి నిర్ణయం చేస్తున్న ము.వివాదాలకు కారణం అవకాశం ఉన్న జండా పాట జరిగే టప్పుడు చైర్మెన్, వైస్ చైర్మన్, పాలక వర్గ సభ్యులుమో ఒక్కో సారి అందరం ఉండి .చిన్న విషయం ఉంటే అక్కడి అక్కడే పరిష్కరిస్తున్నము.ఈ రెండు ప్రధాన మైనవి ప్రభుత్వ ఆదేశాలు అమలు అసలు కీలక విషయం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.