కేసీఆర్ గడీలను పగలగొడతాం: రేవంత్‌రెడ్డి

0
TMedia (Telugu News) :

హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి.. ఆ భూములను లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

s s consultancy

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో  సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్.. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంచారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని రేవంత్‌రెడ్డి  డిమాండ్ చేశారు. దళితులకు 10లక్షలు ఇస్తామంటే.. తనను ఎవ్వరు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి  ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలయ్యే విధంగా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టు.. దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని రేవంత్‌రెడ్డి  చెప్పారు. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం భూములని, లేదంటే ప్రగతి భవన్‌ను అమ్మి ఇచ్చిన మాకు అభ్యతరం లేదన్నారు.దళిత, గిరిజన దండోరా చేసి.. కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు.నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. 10 లక్షలు ఇస్తావా, చస్తావా అని అడగాలన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి దళిత గిరిజన దండోరాను మొదలుపెట్టబోతున్నామని రేవంత్‌రెడ్డి  పిలుపునిచ్చారు. అధిష్ఠానం దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Revanth Reddy  said that we will take unanimous resolution on the Dalit on the brotherhood. He said that he had no objection to the sale of the secretariat lands next to the Tank Bund or the Pragati Bhavan.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.