సి ఎస్ పి-1లో వాహనాలకు మరమ్మతులు చేపించండి..

0
TMedia (Telugu News) :

సి ఎస్ పి-1లో వాహనాలకు మరమ్మతులు చేపించండి..

s s consultancy

సిఎస్పి ఇంజనీర్ కు ఏఐటీయూసీ వినతిపత్రం అందజేత..

టీ-మీడియా ప్రతినిధి/ గోదావరిఖని (మే 09)

సింగరేణి అర్జీ వన్ ఏరియా సి ఎస్ పీ వన్ లో ఉన్న లోడర్ మరియు లారీలు మరమ్మతులు చేయకపోవడం మూలం గా డ్రైవర్లు వాటిని నడపడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ శనివారం సి ఎస్ పి ఇంజనీర్ కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని ఏఐటియూసి డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్ తెలిపారు‌.
శనివారం సి ఎస్ పి లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సి ఎస్ పి లో బొగ్గు రవాణా కోసం ఒక లోడర్,ఆరు లారీలు ఉన్నాయని,వీటికి మరమ్మతులు లేక డ్రైవర్లు నడపడం లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.లోడర్ తో బొగ్గు ను లారీల్లో లోడు చేసే సమయంలో డ్రెవర్ క్యాబిన్ లోకి విపరీతంగా దుమ్ము ధూళి వస్తుందని, దీని వల్ల డ్రైవర్లు వాటిని నడపడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని.అదెవిధంగా ఈ వాహనాలకు గేర్లు, బ్రేకులు సరిగా పడడం లేదని,లైట్లు సరిగా రాకపోవడం వల్ల డ్రైవర్లు రాత్రి షిఫ్టుల్లో వాటిని నడపడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీని వల్ల బొగ్గు రవాణా కు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.లోడర్ డ్రైవర్ క్యాబిన్ కు గ్లాస్ పిటింగ్ ఏర్పాటు చేయాలని, లోడర్ కు, లారీలకు గేర్లు, బ్రేకులు, లైట్లను మరమ్మతులు చేసి, డ్రెవర్ లకు మంచి కండీషన్ లో ఉన్న వాహనాలను బొగ్గు రవాణా కోసం ఇవ్వాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగ సతీశ్ బాబు,శ్రీనివాస రెడ్డి, బొడిమె సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.