దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

0
TMedia (Telugu News) :

టీమీడియా వనపర్తి జిల్లా : వనపర్తి పట్టణంలో షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు శనివారం రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ దీక్షలు గుద్దేటి రాజేష్ మాదిగ మాట్లాడుతూ దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.

s s consultancy

హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కంటే ముందే దళిత బందును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకపోతే రాజకీయ సమాధి చేస్తామన్నారు .మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 25 వేల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అమలు చేయాలని రైతుబంధు పథకానికి ఎలాంటి అర్హతలు నియమ నిబంధనలు లేకుండా వందల ఎకరాలు ఉన్న భూమికి సైతం రైతుబంధు అమలు చేస్తున్నారు. అదే విధంగా దళిత బందు కూడా ఇలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, బిజెఎచ్ఎఫ్ఎస్ కొమ్ము చెన్నకేశవులు మాదిగ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి వీరప్ప, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ రమేష్ , ఎంఈఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గద్వాల కృష్ణ ,ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాగరాజ్ యుగేందర్ మద్దతు తెలుపుతూ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.