గిరిజన అమ్మాయిపై అఘాయిత్యం, హత్య; స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్*

0
TMedia (Telugu News) :

గిరిజన అమ్మాయిపై అఘాయిత్యం, హత్య; స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్*

s s consultancy

టీమీడియా ప్రతినిధి మరిపెడ మే29;
దారుణాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదుఅనితెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బాధిత అమ్మాయి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం*
జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ఆదేశాలు జారి చేశారు.
వివరాలు లోకి వెళ్తే

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష(18)ను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు.
మూడు.ఉష మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యాలయంలో చదువుతోందని, పేదరికం నుంచి వచ్చి ఉన్నతవిద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి దారుణం జరగడం క్షమించరానిదన్నారు. అమ్మాయి మృతికి సంతాపం తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అమ్మాయి తండ్రితో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటామన్నారు. కుటుంబానికి ఆర్ధికంగా చేయుతనిస్తామన్నారు. కుటుంబానికి జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అయితే ఈ అన్యాయానికి పాల్పడిన వారికి మాత్రం తగిన శాస్తి జరిగేలా చేస్తామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.