మద్యం మత్తులోవివాహిత పై అత్యాచార యత్నం…ప్రతిఘటన

0
TMedia (Telugu News) :

వివాహిత పై అత్యాచార యత్నం…
మద్యం మత్తులో అకృత్యాలు…
ఇద్దరు మైనర్లు…

s s consultancy

రాయవరం:-

అబల పై అఘాయిత్యానికి ఓడిగట్టడం, ఆపై దర్జాగా తిరగడం సర్వ సాధారణంగా మారింది. మద్యం మత్తులో అకృత్యాలకు అడ్డు కట్ట లేకుండా పోయింది.మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం వెంటురు గ్రామం లో మంగళవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన నాలుగు యువకులు ఓ వివాహిత(30) పై సామూహిక అత్యాచారానికి యత్నించారు. అబల తిరగబడి ప్రతి ఘటించింది. కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కాగా ఓ యువకుడు పరార్ కాగా మిగిలిన ముగ్గిరిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతం లో ఈ యువకులు ఆ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ పై ఇదే రీతిలో అత్యాచారం కు ప్రయత్నం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం తో  ఘటన పునరావృతం అయ్యియిందని స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నలుగురు లో ఇద్దరు మైనర్ లు వున్నారు. దీనికి సంబంధించిన స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వెంటురు కు చెందిన చోల్లంగి మణికంఠ  స్నేహితులకు బాధితురాలు ఇంటి సమీపంలో అర్ధరాత్రి మద్యం పార్టీ ఇచ్చాడు. తెల్లవారు సమయం లో మణికంఠ, రామచంద్రపురం మండలం జగన్నాయకపాలెం కు చెందిన వీధి లక్ష్మయ్య, మరో ఇద్దరు మైనర్ బాలురు వివాహిత ఇంట్లో కి వచ్చారు. నిద్రిస్తున్న ఆమె తల వద్ద ఇద్దరు, కాళ్ళ దగ్గర ఇద్దరు నిలుచొని తాళ్లతో కట్టేస్తే ప్రయత్నం చేశారు. ఇంతలో మేలుకు వచ్చిన ఆమె ఒక్కసారిగా ప్రతిఘటించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆమె పెద్దగా కేకలు వేయడం తో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కుక్కలు పెద్దగా మొరగడం తో స్థానికులు ఇళ్ల బయటి కి వచ్చారు. పారిపోతున్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. ఓ యువకుడు తప్పించుకొని పరారయ్యాడు. దొరికిన వారిని అక్కడే చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన బాధితురాలు మీడియా కు వివరించారు. మూడు నెలలు క్రితం చోల్లంగి మణికంఠ గ్యాంగ్ తనపై ఇదే రీతిలో అత్యాచారయత్నం కు పాల్పడ్డరని పేర్కొంది. తన భర్త మద్యం షాప్ లో పని చేస్తాడని అతను ఇంట్లో ఉండడని తెలిసే తనపై అఘాయిత్యానికి ప్రయత్నం చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేయడం తో మణికంఠ బ్యాచ్ ఆగడాలు మితిమిరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.