రామప్పకు సింగరేణి మైనింగ్‌ తో ముప్పు అవాస్తవం

0
TMedia (Telugu News) :

టీమీడియాహైదరాబాద్;
ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఓపెన్‌కాస్టు,
సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకు
రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి తర్వాతే తదుపరి కార్యాచరణ
సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ

ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌ తో ముప్పు పొంచి ఉందని కొన్ని ప్రచార మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని యాజమాన్యం తెలియజేసింది.

s s consultancy

సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపురం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, తాజాగా యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, దీని పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, అవాస్తవాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

 

The Singareni  management would not cause any harm to the Ramappa temple and its surroundings. The management is committed for the protection of the ancient monumental structure.Hyderabad

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.