అధికారులకు,సర్పంచులకు మెమొలు,షోకాజ్ నోటీసులు జారీ…..కలేక్టర్

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి, రాజన్న సిరిసిల్లా జిల్లా,జులై 31:

విధుల్లో అలసత్వం వహించిన వారికి మెమో లు జారీ

ఒక ఎంపీడీఓ, ఇద్దరు ఎంపీఓ లు, ముగ్గురు కార్యదర్శులకు మెమో లు

ఒక సర్పంచ్ లు షోకాజ్ నోటీసు

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్

s s consultancy

గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు, నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయడంలో విఫలమైన వారికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ శనివారం మెమో లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయితీ కార్యదర్శులు తమ ప్రాథమిక విధులను సక్రమంగా, క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో విఫలమైనందుకు గాను బోయినిపల్లి మండలం మాన్వాడ గ్రామ కార్యదర్శి రాజశ్రీ, కొదురుపాక గ్రామ కార్యదర్శి అంజలి, గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామ కార్యదర్శి రవి కి కలెక్టర్ మెమో లు జారీ చేశారు. అలాగే మాన్వాడ గ్రామ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

గ్రామాల్లో చేపడుతున్న పనులను సరిగా పర్యవేక్షణ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన బోయినిపల్లి ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగాతిలక్, గంభీరావుపేట ఎంపీఓ రాజశేఖర్ కు మెమో లు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ మెమో లకు 24 గంటల్లో తిరిగి సంజాయిషీ సమర్పించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Collector memos were issued to Boinipalli Mandal  Manwada village Secretary Rajashree ,Kodurupaka  village secretary Anjali and Gambhiraupeta Mandal Gambhiraupeta. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.