రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

0
TMedia (Telugu News) :

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్ధాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం

ఒకప్పటి మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ధాన్యం రాశుల దిగుబడి

వారం రోజుల్లోగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ పూర్తి

సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సందర్శనలో మంత్రి శ్రీ కేటీఆర్

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,జూన్ 2:

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఒకప్పుడు కరువు, మెట్ట ప్రాంతంగా ముద్రపడి ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు అంచనాలకు మించి ధాన్యం రాశుల దిగుబడి వస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఇది సాధ్యం అయిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు.

బుధవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సిరిసిల్ల పరిధిలోని సర్ధాపూర్ లో నూతనంగా సుమారు 20 కోట్ల రూపాయలతో, 20 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి క్షేత్ర స్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, స్వయంగా ముఖ్యమంత్రి వర్యులకు వ్యవసాయంపై పట్టు, రైతాంగం సమస్యలు తెలుసుకాబట్టే వ్యవసాయ, సాగునీటి రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్షక ప్రభుత్వంగా అవతరించిందని స్పష్టం చేశారు.

s s consultancy

జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సాగునీరు లేక, పంటలకు సమయానికి నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఈ ప్రాంతంలో చూశామని, ముఖ్యమంత్రి వర్యుల దూరదృష్టి, ప్రత్యేక చొరవతో కాళేశ్వరం జలాల ద్వారా నడి ఎండాకాలంలో ఎగువ మానేరు పరవళ్లు తొక్కే సజీవ దృశ్యాలు మనం చూస్తున్నామని అన్నారు. అప్పటి మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ధాన్యం రాశుల దిగుబడి అంచనాల కంటే ఎక్కువగా ఉండడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు.

రైతుల శ్రేయస్సును కాంక్షించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధునాతనమైన సదుపాయాలతో సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ లో వ్యవసాయ మార్కెట్ యార్డును భారీ సామర్థ్యంతో సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ నెల 11 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ఈ వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లను చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. వానాకాలం యొక్క సాగు గురించి ప్రభుత్వ ఆలోచనలు, ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న రైతు బంధు చెక్కుల పంపిణీ గురించి వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తావిస్తారని మంత్రి తెలిపారు.

అంతకంటే ముందుగా జిల్లాలోని భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడతారని, రైతులు వారి వారి సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే రైతులు ఎవరూ నష్టపోకుండా అటవీ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేస్తూ గతంలో రైతు బంధును పొందిన వారందరికీ, వారితో పాటు కొత్తగా అర్హులైన ఎక్కువ మందికి కూడా రైతుబంధు సాయం అందించాలని ఆదేశించారు.

అంతకముందు మంత్రి కేటీఆర్ సర్ధాపూర్ లోని 17 వ పోలీస్ బెటాలియన్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా బెటాలియన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. బెటాలియన్ కమాండ్ కంట్రోల్ భవనం, బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను, గార్డ్ రూమ్ లను మంత్రి పరిశీలించారు.

బెటాలియన్ కమాండెంట్ టి.అలెక్స్ బెటాలియన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి కేటీఆర్, నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే లు మైదానం ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్శనలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జిందం కళా, గ్రంథాలయ చైర్మెన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ శ్రీనివాస రావు, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.