రైతు రాజ్యమే టిఆర్ఎస్ లక్ష్యం. ఎమ్మెల్యే దివాకర్ రావు.

0
TMedia (Telugu News) :

రైతు రాజ్యమే టిఆర్ఎస్ లక్ష్యం. ఎమ్మెల్యే దివాకర్ రావు.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షేట్టిపేట్, మంచిర్యాల జిల్లా, జూన్ 06

లక్షెట్టిపేట మండలంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యే దివాకర్ రావు విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రైతే రాజు అనే పదానికి నిర్వచనమే టిఆర్ఎస్ ప్రభుత్వమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. గత 2013-14 సంవత్సరం యాసంగి లో కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సాగుఅయ్యేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దిగువ నీరు ద్వారా గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ యాసంగిలో 15.716 లక్షల ఎకరాలు సాగు అవుతున్నయన్నారు. గతంతో పోలిస్తే పంట దిగుబడి ఐదంతలు పెరిగిందన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఎండాకాలం వస్తే కనీసం పశువులకు కూడా త్రాగునీరు ఉండేది కాదని. అలాంటిది నేడు ఎల్లంపల్లి రిజర్వాయర్ లో 10 టీఎంసీ నీరు ఉండడం వలన నీటి లభ్యత పుష్కలంగా పెరిగిందన్నారు. దండేపల్లి మండలం లోని నంబాల, కాసిపేట లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మొదేలలో ఎత్తిపోతల ప్రాజెక్టులో నేడు కళకళలాడుతున్నయని ఇది చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్లు రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని. ఈ యాసంగి లో కేవలం మూడు మండలాలైన దండేపల్లి, లక్షెట్టపేట,హజిపూర్ రైతులు ఎన్నడు లేనంతగా 103693.44 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందన్నారు. సుమారుగా 200 కోట్ల ఆదాయం రైతులకు చేరిందని ఆయన తెలిపారు. మే 31 లోపు గా మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతు వ్యతిరేక బీజేపీ విధానాల వలన ఆ పార్టీ కేంద్ర పాలిత రాష్ట్రాల్లో వడ్లను కేవలం పన్నెండు వందల రూపాయలకే క్వింటాల్ కి కొంటున్నారని కానీ తాము మాత్రం తెలంగాణలో 1880 రూపాయలకు కోనడం ద్వారా మూడు మండలాల రైతులకు దాదాపు 80 కోట్ల ఆదాయం సమకూరింది అన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినా ప్రభుత్వాలు మాకు చెప్పేది ఏమిటి అని మండిపడ్డారు.ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడెటి శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పాని లింగయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షులు మోట పలుకుల గురవయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,అంకతి రమేష్, కౌన్సిలర్స్ చాతరాజు రాజన్న, పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు గరిసే రవీందర్, పలువురు సర్పంచులు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.