ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డా: పీవీ సింధు_

0
TMedia (Telugu News) :

టోక్యో: తాజా ఒలింపిక్స్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాంస్యం గెలవడం సంతోషంగా ఉందని స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, పీవీ సింధు అన్నారు. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్‌ పార్క్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో నా బలహీనతలపై దృష్టి పెట్టా. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ పార్క్‌ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్‌ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ ఎంతో ఉపయోగపడింది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉంది. అదే సమయంలో సెమీస్‌లో ఓడిపోవటం చాలా బాధగా అనిపించింది. సెమీస్‌లో ఓటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యా. కాంస్యం అవకాశం ఉందని సర్ది చెప్పుకొన్నా. పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ విజయాన్ని నా కుటుంబానికి, అభిమానులకు అంకింతం చేస్తున్నా.’’ అని సింధు చెప్పుకొచ్చారు.

s s consultancy

On monday  she spoke to reporters along with Couch Park from Tokyo. This occasion sindhu said.. Focus on my weeknesses during corona. couch park worked very hard to train me.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.