వామనరావు హత్య కేసు.. పుట్ట మధు పాత్ర లేదా?

0
TMedia (Telugu News) :

వామనరావు హత్య కేసు.. పుట్ట మధు పాత్ర లేదా?

హైదరాబాద్:

సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకేసు కొలిక్కి వస్తోందా? ముందు నుంచీ ఊహించిన పుట్ట మధు ప్రమేయం కేసులో ఇక లేనట్లేనా ? మంథని పోలీసులు దాఖలు చేసిన చార్జీ షీట్ లో పుట్టమధు పేర్లు తప్పించారా? హత్య కేసులో పుట్ట మధు పాత్రను కేవలం విచారణతోనే ముగించేశారా?

s s consultancy

పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ లో కోర్టుకు అప్ లోడ్ చేశారు. కేసులో మొత్తం ఏడుగురు పాత్రదారులు, సూత్రదారులుగా తేల్చేశారు. పోలీసులు అప్ లోడ్ చేసిన చార్జీ షీట్ లో ఏ1 కుంట శ్రీను, ఏ2 చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్, ఏ4గా బిట్టు శ్రీను, ఏ5 గా ఊదరి లచ్చయ్య, ఏ6 కాపు అనీల్, ఏ7గా వసంతరావును చేర్చారు. వారిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకుని జైలుకు పంపించారు.

తన కొడుకు వామన్ రావు, తన కోడలు నాగమణిల హత్య కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టమధు దంపతుల ప్రమేయం ఉందని కిషన్ రావు ఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద విచారణ జరుగుతుండగానే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం తెరమీదకు వచ్చింది. వెను వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆయనకు సన్నిహితుడిగా ముద్ర పడ్డ పుట్టమధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం అయ్యారు. వారం రోజుల పాటూ పుట్టమధు కోసం పోలీసులు వెతికారు. ఈలోగా నాలుగైదు రాష్ట్రాలు, ఆరు సెల్ ఫోన్లు, నాలుగు కార్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారంగా పుట్టమధును భీమవరంలో పట్టుకున్నారు. మూడు రోజుల పాటూ పోలీసులు రామగుండం కమిషనరేట్ లో మధును విచారించారు. ఎందుకు కనపడకకుండా పోయారు ? ఫోన్ ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు అన్న ప్రశ్నలకు అదే పొరపాటు జరిగిందని పుట్టమధు వివరణ ఇచ్చారు. అంతకు మించి కేసులో తన ప్రమేయం పై నోరు విప్పలేదని తెలిసింది. ఆ తర్వాత పుట్టమధు భార్య, మంథని మున్సిపల్ ఛైర్మన్ శైలజకు కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. తాజాగా వేసిన ఛార్జీ షీట్ లో ఇద్దరి పేరూ లేదని తెలిసింది. న్యాయవాది వామన్ రావు తండ్రి మాత్రం పుట్టమధు సహా ఇతర పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.