పడకేసిన ప్రజారోగ్యం

0
TMedia (Telugu News) :
s s consultancy

రాష్ట్రంలో పడకేసిన ప్రజారోగ్యం

 • మొద్దు నిద్రలో ప్రభుత్వం
 • టిఆర్ఎస్ పాలనలో కష్టాల మోత
 • దిక్కు తోచని స్థితిలో కరోనా బాధితులు
 • ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా..?
 • రాష్ట్రంలో ఆరోగ్య శాఖ నిర్వీర్యం
 • దొర వ్రాసిన స్క్రిప్ట్ చదివి చేతులు దులుపుకుంటున్న అధికారులు
 • నీ ఇష్టానుసారం ఆడడానికి ఈ రాష్ట్రం నీ జాగీర్ కాదు
 • బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ టీ మీడియా ప్రతినిధి, చిట్యాల (మే9):
  రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలంలో ప్రజల అర్థనాదాలు మిన్నంటి దిక్కులేని చావు చస్తున్న ప్రభుత్వానికి లేదని, కల్వకుంట్ల కుటుంబం గుప్పిట్లో బందీ అయిన తెలంగాణ ప్రస్తుతం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితి వైరస్ విజృంభణ అత్యంత భీకరమైన స్థితిలో ఉన్న కూడా రాష్ట్రంలో వైరస్ తీవ్రత లేదని, ప్రచారం చేస్తూ, నువ్వు, నీ తొత్తులు చంకలు గుద్దుకుంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని
  మండిపడ్డారు. అసలు రాష్ట్రాన్ని, ప్రజలను ఏమి చేయదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. వైరస్ కట్టడికి అమలు చేయాల్సిన చర్యలను పక్కకు పెట్టి రోజుకో కొత్త కొత్త నాటకానికి తెరలేపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం నీ నీచ కుతంత్ర బుద్ధికి నిదర్శనమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకపక్క ప్రతిపక్షాలు, మరోపక్క ప్రజల అర్థనాదాలతో రాష్ట్రం వల్లకాడుగా మారుతుంటే చితిమంటలతో చలి కాచుకుంటూ ఫామ్ హౌజ్ లో పడుకున్న నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకు లేదని ఆయన తెలిపారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత, ఒక నాయకునికి ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. నీ స్వార్థం, నీ కుటుంబ సంక్షేమం కోసం అధికారులను నీ పాలేర్లుగా మార్చుకుని అంతులేని అక్రమాస్తులను కూడా పెట్టుకుంటూ పాలనంతా నీ గుప్పిట్లో పెట్టుకుని, కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే నీ పాలనకు చరమగీతం పాడాల్సిన రోజు దగ్గర్లోనే ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మందులు లేవు, ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు,ఆక్సిజన్ లేదు, నిర్ధారణ పరీక్షలు లేవు, రోగులకు చికిత్సలు లేవు.. మరీ.. కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేయాలనుకుంటున్నారని, మీ వద్ద ఏమైనా అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏదైనా ఉందా అని మహేందర్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ క్లిష్టమైన ఈ సమయంలో నిర్వీర్యమై ప్రజల్లో ఉనికిని సైతం కోల్పోతున్నా ఆరోగ్యశాఖ అధికారులు ఉద్దరిస్తున్న ఘనకార్యమెందో అర్థం కావడం లేదని, దొరగారిచ్చిన స్క్రిప్ట్ చదివి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అత్యంత ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవుల్లో ఉండి, ప్రజలకు అన్ని విధాల అండదండగా ఉండాల్సిన అధికారులు పాలకులకు తొత్తులుగా మారి ఫామ్ హౌజ్ సేవ చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు..? ఓట్లు ఉంటేనే ప్రజలు గుర్తుకు వస్తారా..? ప్రజల కష్టసుఖాలు పట్టవా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను, ప్రజారోగ్యాన్ని విస్మరించి నీ నీచ కుట్రపూరిత దుర్బుద్ధితో దేవరాంజల్ భూములపై కమిటీలు వేసి జిల్లా కలెక్టర్లను సభ్యులుగా వేయడమెంటని, జిల్లాల్లో కలెక్టర్లు లేకుంటే కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలను ఎవరు సమీక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రజల కన్నా..తన కక్ష సాధింపు చర్యలే ముఖ్యమని విమర్శించారు. అహంకార, అధికార మదంతో విర్రవీగి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి చరిత్రహీనులుగా చరిత్రలో మిగిలిపోయారని,అదేగతి నీకు త్వరలో పట్టబోతుందని జోస్యం చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.