పోలీస్ లపై మానవ హక్కుల కమీషన్,రాష్ట్ర డిజిపిలకు బాధితుల ఫిర్యాదు

0
TMedia (Telugu News) :

జగిత్యాల పోలీస్ లపై మానవ హక్కుల కమీషన్,రాష్ట్ర డిజిపిలకు బాధితుల ఫిర్యాదు

బూటు కాలుతో ముఖంపై తన్నాడని వృద్దుని ఆవేదన

s s consultancy

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల;,జూన్ 02

జగిత్యాల పట్టణ పోలీసులు గత శనివారం రాత్రి అన్యాయంగా మమ్మల్ని నిర్బంధించి నానా భూతులతో తిట్టుతూ చిత్రహింసలు పెట్టి కొట్టారనిపట్టణానికి చెందిన బూసి లచ్చన్న రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు, రాష్ట్ర డిజిపిలకు మంగళవారం పిర్యాదు చేసినట్లు తెలిపారు.
బుధవారం బూసి లచ్చన్న ఆయన కుమారుడు బూసి ఇంద్ర సేనారెడ్డిలు జగిత్యాల లో విలేఖరులతో మాట్లాడుతూ పోలీసులు చితకబాదారని ఆరోపించారు.
బూసి లచ్చన్నకు చెందిన భూ తగాదా విషయంలో జగిత్యాల పట్టణ పోలీసులు పలుమార్లు వేధించగా 2020 ఆక్టోబర్ 16 న జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశామన్నారు.భూతగాదా విషయాలు కోర్టులో చూసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారని అన్నారు.అందులో జోక్యం చేసుకోకూడదని మా ముందే ఫోన్ చేసి జిల్లా ఎస్పీ పట్టణ పోలీసులను హెచ్చరించారని బాధితులు పేర్కొన్నారు. కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న పోలీసులు మళ్లీ స్టేషన్ కు పిలిపించుకొని అప్పటి ఎస్సై శంకర్ నాయక్ బలవంతంగా సంతకాలు తీసుకొని నీ మీద కేసు నమోదు చేశామని తెలిపినట్లు బూసి లచ్చన్న ఫిర్యాదులో పేర్కొన్నారు.శనివారం రాత్రి 7 గంటలకు పట్టణ పోలీసులు లచ్చన్నను అతని కొడుకు ఇంద్రసేనారెడ్డిని రాము అనే కానిస్టేబుల్ ద్వారా పిలిపించుకొని పట్టణ సిఐ జయేష్ రెడ్డి,ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుల్ రాములతో పాటు మరికొందరు విచక్షణా రహితంగా చిత్ర హింసలు పెట్టి కొట్టారని,బూతులు తిట్టుకుంటూ,లాఠీలతో,బెల్టు లతో కొడుతూ,పిడి గుద్దులతో గుద్ది,బూట్ కాళ్లతో ఇష్టమొచ్చినట్లు తన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
పోలీసుల దెబ్బల వలన ఇద్దరికీ బలమైన దెబ్బలు తగిలి రక్తగాయాలు,శరీరంపై అనేక చోట్ల కండరాలు కమిలిపోయాయని,కడుపులో, ఛాతీలో,కిడ్నీలపైన కూడా పోలీసులు గుద్దిన గుద్దులతో అంతర్గతంగా బలమైన దెబ్బలు తగిలి అస్వస్థతకు గురయ్యామన్నారు.
చచ్చిపోతామని అంటూ వేడుకొని సిఐ జయేష్ రెడ్డి కాళ్లపై పడి మొక్కితే బూటు కాలుతో తనను ముఖంపై తన్నారని అన్నారు.బాధితుడు లచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారుపోలీస్ మమ్మల్ని సివిల్ హాస్పిటల్ కు బంధువుల ద్వారా తరలించారని తెలిపారు.మరుసటి రోజున జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేశామన్నారు.ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీని కలువండని తెలుపగా డీఎస్పీని కూడా కలిశామని బాధితులు అన్నారు.పోలీస్ చిత్ర హింసలతో చచ్చి బ్రతికినట్లు చావుబ్రతుకుల నుండి బయట పడ్డామని అన్నారు.న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు (హెచ్
ఆర్.సి. కి) రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.