ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.
===మరీదు నరేష్

రబీ సీజన్‌లో రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు మాత్రం సకాలంలో జరగటం లేదని, ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని వైఎస్ షర్మిల వర్గం నేత మరీదు నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే చింతకాని మండలంలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతుల వద్ద నుంచి కొనుగోలు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని రైతు కళ్లల్లో పర్యటించి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని నాగులవంచ గ్రామ సొసైటీ పరిధిలోనే సుమారు 40 వేల బస్తాల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ సాగడం లేదని అధికారులు చెప్తున్నారని, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. వాతావరణంలో మార్పులు కారణంగా కురుస్తున్న టువంటి అకాల వర్షాలకు ఎంతో మంది రైతులు కష్టపడి పండించిన పంట నీళ్ల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళార్లకు అవకాశం ఇవ్వకుండా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని నేరుగా సీసీల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గన్ని బ్యాగులు కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బండి కోటయ్య, మొగిలి వెంకటేశ్వర్లు, అరివికొట్ల నాగ బూసి, పర్చగాని నాగేశ్వరావు, పర్చగాని నవీన్, గుండ్ల రాంబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.