ముస్తఫా పై పీడీ యాక్ట్

0
TMedia (Telugu News) :

ముస్తఫా పై పీడీ యాక్ట్

టీమీడియాఖమ్మం :

s s consultancy

నగరంలోని ద్వారక నగర్ కు చెందిన మహ్మద్ ముస్తఫా పై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టును అమలు చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. రౌడీషీటర్ గా ఖమ్మం టూ టౌన్ పోలీస్ రికార్డులో వున్న మహ్మద్ ముస్తఫా
నేరపూరిత బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, దాడులకు పాల్పడే నేర స్వభావం కలిగి ఉన్నందున పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
ఇటీవల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో నిందితుడుగా వున్న ముస్తఫాపై ఖమ్మం టూ టౌన్ లో కేసు నమోదు కాగా అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పిడీ యాక్ట్ అమలు చేస్తూ…ఖమ్మం జైలు నుండి హైదరాబాదు చంచల్ గూడ జైలుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.