నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయదారుల పై పీడీ యాక్ట్. పోలీస్ కమిషనర్

0
TMedia (Telugu News) :

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయదారుల పై పీడీ యాక్ట్.

టి మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా జూన్ 05

s s consultancy

విత్తన వ్యాపారులకు,నకిలీ వితనాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సమావేశం కి రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు… నకిలీ విత్తనాలను అమ్మే వారిని ప్రభుత్వం ఎంతటి వారినైనా ఉపేక్షించకుండాపీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అమాయకపు రైతులను కొంతమంది కాసుల కక్కుర్తితో అనుమతుల్లేని పురుగుమందులు అంటగట్టిమోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి మోసగాళ్లపై ఉక్కు పాదం మోపి నకిలీ విత్తనాలు నియంత్రించాలని గట్టి సంకల్పంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీమ్ లతో పాటు ప్రతి మండలాల్లో నిరంతరం పూర్తిస్థాయి నిఘాతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, కర్ణాటక ల నుంచి నకిలీ విత్తనాలు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నట్లు సమాచారం ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, నిబంధనలకు అనుగుణంగా డీలర్లు విత్తనాలను విక్రయించాలని సూచించారు
హెచ్‌టీ కాటన్‌(బీటీ-3) విక్రయాలకు అనుమతి లేదు. అలాగే అనుమతి లేని అనేక విత్తనాలు ప్రస్తుత సీజన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఇలాంటి వాటిని
ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్మినా చర్యలు తప్పవన్నారు. రైతులకు ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఇవ్వాలని అన్నారు.
రైతులు కొనుగోలు చేసిన వాటికీ డీలర్లు రసీదులు ఇవ్వాలని తెలిపారు.
లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచి విత్తనాలను రైతులు కొనుగోలు చేయాలి.
విడి విత్తనాలను అమ్మరాదు. వాటిని రైతులు సైతం కొనవద్దు
క్లాత్ సంచుల్లో ప్యాక్ చేసిన విత్తనాలను తీసుకోవద్దు
కొన్న విత్తనాలను సంబంధించిన రసీదు పై డీలర్ సంతకం తీసుకోవాలి.
కాళీ విత్తన సంచులు సాగు చివరి వరకు భద్రపరుచుకోవాలి తేడా వస్తే ఆధారాలతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

దుష్ప్రభావం….

హెచ్‌టీ కాటన్‌(హెర్బిసైడ్‌ టాలరెన్స్‌) అనేవి జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలు. ఇవి గ్లైఫోసెట్‌ అనే కలుపు మందును తట్టుకుంటాయి. ఈ కలుపు మందు పత్తి పంటను కాకుండా మిగతా అన్ని కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. గ్లైఫోసెట్‌ మందు క్యాన్సర్‌ కారకమని రుజువు కావటంతో ప్రభుత్వం దీన్ని కూడా నిషేధించింది. ఇది పర్యావరణానికి సైతం తీరని హాని కలిగిస్తుంది. హెచ్‌టీ కాటన్‌తో పర్యావరణంలోని, జీవులపై పడే ప్రభావంఎక్కువ అయినా ఈ వ్యాపారం, రహస్యంగా సాగుతున్నాయి. అనుమతి లేని ఇలాంటి విత్తనాలను సాగు చేయటం కూడా చట్టపరంగా నేరమే. పర్యావరణ రక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హులు.
ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన డీలర్లు, ఆర్గనైజర్లు సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకరావాలి , లేదా డయల్ -100 పోలీస్ కు సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఎవరైనా నకిలీ సీడ్స్ ను అమ్మిన, సరఫరా చేసిన, అలాంటి వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని అన్నారు.
ఈ సమావేశం లో డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి,బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్,, మంచిర్యాల డిఏఓ వినోద్ కుమార్,ఇంతయాజ్ అహ్మద్,ఏడిఎ భీమిని,బాపు ఏడిఏ చెన్నూర్, బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు, మందమర్రి సీఐ ప్రమోద్ రావు, తాండూర్ సీఐ బాబు రావు,సబ్ డివిజన్ ఎస్ఐ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.