బాలిక పై అత్యాచారంనేరస్థుని పై పీడీ యాక్ట్ అమలు.

టి మీడియా రామగుండం పెద్దపల్లి 

0
TMedia (Telugu News) :

 అత్యాచారంనేరస్థుని పై పీడీ యాక్ట్ అమలు.

టి మీడియా రామగుండం పెద్దపల్లి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో దేదావత్ రెడ్యా నాయక్  అను వ్యక్తి  30 ఏప్రిల్ 2021 రోజున, ఎనిమిది 08 సంవత్సరాల ఒక మైనర్ బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆమెని బిస్కట్ పాకెట్ ఇస్తానని ఆశ చూపి ,ఊరి చివరనున్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆ మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేశాడు.

s s consultancy

జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. బాలిక ద్వారా ఆమె అమ్మమ్మ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసినారు, గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ విచారణ చేసినారు. తదుపరి ఇట్టి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు దేదావత్ రెడ్యా నాయక్  అనబడు సెక్సువల్ అఫెండర్” పై రామగుండం  పోలీస్‌ కమిషనర్‌ వి. సత్యనారాయణ పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు.

పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన పీ.డీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులను రామగుండం సర్కిల్  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మి నారాయణ,ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ లు నిందితునికి అందజేసిన అనంతరం కరీంనగర్ జిల్లా జైలు నుండి గురువారం హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడమైనది.నేరస్థుని పై పీడీ యాక్ట్ అమలు కు కృషి చేసిన ఏసీపీ ఉమెందర్, సీఐ రామగుండం లక్ష్మి నారాయణ ,ఎస్ఐ ఎన్టీపీసీ స్వరూప్ రాజ్ సీపీ అభినందించారు.

PD ACT Case On Criminal
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.