నకిలీ విత్తనాల స్మగ్లర్లర్‌ పై పీ.డీయాక్ట్‌

0
TMedia (Telugu News) :

జర్….

s s consultancy

.ఎవరినీ వదిలేదిలేదు.

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి//టి మీడియా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2 టౌన్,తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్తీ నకిలీ పత్తి విత్తనాలు అక్రమ సరఫరా చేస్తూ రైతులను
మోసం చేస్తున్న 1.పత్తిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి,2.వూస సుబ్బారావు,3.చౌదరి దినేష్ అను ముగ్గురు నకిలీ విత్తనాల అక్రమ వ్యాపార నేరస్తుల పై రామగుండము పోలీస్‌ కమిషనర్‌ పీ.డీయాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను బెల్లంపల్లి రూరల్ సర్కిల్  ఇన్స్ స్పెక్టర్‌ జగదీష్ ,ఎస్ఐ సమ్మయ్య, బెల్లంపల్లి 2టౌన్ ఎస్ఐ భాస్కర్  లు పీ.డీ యాక్ట్ నిర్బంద ఉత్తర్వులను నిందితులకి అందజేసి అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడమైనది.పత్తి రెడ్డి ప్రభాకర్ రెడ్డి వూస సుబ్బారావు,చౌదరి దినేష్ నేర నేపథ్యం.ముగ్గురు ఒక ముఠా గా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ కి చెందిన గొల్లపూడి రోశయ్య అనే వ్యక్తి  ద్వారా కల్తీ  పత్తి విత్తనాలు తీసుకువచ్చి, మంచిర్యాల జిల్లాలోని రైతులకు నిజమైన మరియు ప్రభుత్వ అమోదిత పతి విత్తనాలు గా నమ్మించి అమ్ముచూ,అధిక మొత్తంలో డబ్బులు సంపాదించటం వంటి నేరాలకు పాలుపంచుకుంటున్నారు.2021 సం,, లో ముగ్గురు ఇప్పటి వరకు  వరుసబెట్టి త్వరితగతిన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో (03) నేరాలకు పాల్పడినారు.తమ యొక్క అనుచరులు/ఏజెంట్ల ద్వారా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని అమాయక రైతులకు నకిలీ కల్తీ పత్తి విత్తనాలను నిజమైన మరియు ప్రభుత్వ ఆమోదిత పత్తి విత్తనాలు గా నమ్మించి అమ్ముచూ,రైతులను మోసం చేస్తూ సులభంగా మరియు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడంవంటి నేరాలకు పాల్పడడం జరిగింది.వీరి ద్వారా కల్తీ  పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు చాలా నష్టపోయి, కనీసం పెట్టుబడి కూడ రాలేక పోయింది.ఇలాంటి పరిస్థితులలో రైతులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉన్నది మరియు అదేవిధముగా ఉద్వేగానికి లోనయిన రైతులు వ్యవసాయ కార్యాలయాల్లోకి చొరబడి వ్యవసాయ విభాగం అధికారులపై దాడి చేసే ప్రమాదం ఉన్నది.ఇలాంటి ఘటనల వలన సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా అమాయక రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నకిలీ విత్తనాల ద్వారా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మరియు మాయ మాటలు చెప్పి రైతులకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు కొన్ని ఉత్తర్వులను జారీ చేసిందని ఇందులో భాగంగానే నకిలీ విత్తనాలను అమ్మేవారిపై మరియు సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసు  అధికారులు కృతనిశ్చయంతో నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తుల జాబితాను సిద్ధం చేయడం జరిగింది.దానిలో భాగంగా శుక్రవారం  ముగ్గురు పై పి.డి యాక్ట్ అమలు చేయడం జరిగింది అదేవిధంగా అతి త్వరలో వారిపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందన్నారు.
నకిలీ విత్తనాల అక్రమ రవాణా చేయడానికి స్మగ్లర్లు కొత్త కొత్త ఆలోచనల తో పథకాలు వేస్తున్న వారి అంచనాలకు అందకుండా రామగుండము కమీషనరేట్ టాస్క్ ఫోర్సు, స్థానిక పోలీసులు ప్రజల సహకారంతో ,ఆధునాతన సాంకేతిక పద్దతుల ద్వారా వారి కదలికలను గుర్తించి ఈ నకిలీ వ్యాపారం జరగకుండా దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపడం జరుగుతుంది.రామగుండము కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా చేసేవారి మరియు గ్రామీణ స్థాయి నుండి సకహరించే వారి వివరములు సుమారు 50 మంది జాబితా సిద్దం చేయడం జరిగింది ,అదేవిధంగా ఆంధ్ర, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల లోని  స్మగ్లర్ ల జాబితా కూడా  సిద్దం చేయడం జరిగింది. వీరిపై  త్వరలో చట్టరీత్య కేసులు నమోదు చేసి కఠిన  చర్యలకు రంగం సిద్దమైంది.రైతుల కష్టాన్ని దోచుకుంటు అక్రమ వ్యాపారం చేస్తున్న  అక్రమార్కులు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలేది లేదు.. ఇంకా ఈవ్యహారంపై పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సహాయం కూడా తీసుకుంటూ అందరిపై కేసులు నమోదు చేస్తాం. పీడీ యాక్టు నమోదుకు వెనకాడేది లేదు.కమీషనర్ రేట్ పరిదిలో  అక్రమ  నకిలీ దందా చేసే ప్రతి ఒక్కరిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగింది. ఎన్ని సార్లు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన కూడా కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తన మార్చుకోకుండా ఈ అక్రమ దందా కి పాల్పడుతున్నారు.వారి జాబితా సిద్దం చేశాం వారిపై ముందుగా పిడి యాక్ట్ త్వరలో అమలు చేస్తాం .అదేవిదంగా  మరి కొంత మంది జాబితా సిద్దం చేస్తున్నాం త్వరలోని పిడియాక్ట్  అమలు చేయడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాల తయారీ, అక్రమ సరఫరా నేరస్తులపై పీడీ యాక్ట్‌ అమలు చేయుటకు కృషి చేసిన  ఏసీపీ బెల్లంపల్లి  రహెమాన్ , బెల్లంపల్లి సర్కిల్  ఇన్స్ స్పెక్టర్‌ జగదీష్ , బెల్లంపల్లి 2టౌన్  ఎస్ఐ భాస్కర్ ,తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య, నెన్నల్ ఎస్ఐ రమాకాంత్  లను సిపి అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.