భీమ్లానాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ”… రీమేక్ షూటింగ్ లో పవన్ కల్యాణ్

0
TMedia (Telugu News) :

మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’
పవన్, రానాలతో తెలుగులో రీమేక్
షూటింగ్ పునఃప్రారంభం
అన్ని జాగ్రత్త చర్యల నడుమ చిత్రీకరణ

మలయాళంలో ప్రజాదరణ పొందిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇందులో పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. తాజాగా పవన్ కూడా సెట్స్ పైకి వచ్చారు.

s s consultancy

ఈ నేపథ్యంలో చిత్రబృందం “భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ” అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్ రిలీజ్ చేసింది. ఖాకీ దుస్తుల్లో ఉన్న పవన్ ను ఈ పిక్ లో చూడొచ్చు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని చిత్రీకరణ కొనసాగిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Pawan Kalyan and rana Daggubati are palying the lead roles in the popular Malayalam movie ‘Ayyappanum Koshiyum’.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.