45 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

0
TMedia (Telugu News) :
s s consultancy

45 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

టీ మీడియా ప్రతినిధి, చిట్యాల(మే 9): మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ శివారులో శనివారం 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. మొగుల్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన గైకోటి అశోక్ గత కొంత కాలంగా చుట్టు పక్క గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు. ఈ బియ్యాన్ని జూకల్ గ్రామానికి చెందిన బడా వ్యాపారి సురభి రాజు. అలియాస్ రవీందర్ కు కమీషన్ పై విక్రయిస్తున్నాడు. ఇందులో భాగంగా డిసిఎం AP 29 TB 0561.వాహనంలో 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సె పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాన్ని సీజ్ చేసి వ్యాపారస్తులు సురభు రాజు, గైకొటి అశోక్, డ్రైవర్ పడల రమేష్ పై కేసు నమోదు చేశామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.