దళితుల భూముల లో టిఆర్ఎస్ నేతల అక్రమ పట్టాలు

0
TMedia (Telugu News) :
s s consultancy

దళితుల భూములపై టిఆర్ఎస్ నేతల హస్తం పట్టించుకోని అధికారులు నిరసన చేపడుతున్న దళితులు.

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా/ఆర్మూర్ ,మే 12 (న్యూస్) : ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపెట్ మండలం దత్తాపూర్ గ్రామంలో దళిత కుటుంబాలకు చెందిన 496,494 సర్వే నంబర్ గల భూమి టీఆరెఎస్ నాయకులు అక్రమ పట్టాలు చేసుకోవడాన్ని నిరసిస్తూ అక్రమ పట్టాలను రద్దు చేసి దళితులకు పట్టాలు పంపిణీ చేయాలని MRPS ఆధ్వర్యంలో నిరసన ఈ సందర్భంగా MRPS జిల్లా అధ్యక్షులు మైలారం బాలు మాట్లాడుతూ నందిపెట్ మండలం దత్తాపూర్ గ్రామంలో దళిత కుటుంబాల భూ సమస్యలు పరిష్కరించాలని 78 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ఆ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు దళితుల మీద దాడులకు పాల్పడిన ఇంత వరకు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు గతంలో ఆర్మూర్ ఎమ్మేల్యే జీవన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంలో RDO గారు వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి దళితులకున్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు.
అయినప్పటికీ ఇప్పటివరకూ రెవెన్యూ యంత్రంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఎమ్మెల్యే గారు తన షాపింగ్ కాంప్లెక్స్ పై ఉన్న శ్రద్ధ దళితుల మీద లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గార్లు వారి పేరు ప్రక్కన రెడ్డి వున్నది కాబట్టే స్థానిక టీఆర్ఎస్ నాయకులకు మద్దతు ఇస్తు దళితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని అన్నారు.
24 గంటల్లో దత్తాపూర్ గ్రామానికి చెందిన దళితుల భూ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గోపి,కుషోల్ల గంగాధర్, రాజేశ్వర్, విప్లవ్ మరియు MRPS నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.