నాగారం పెద్ద చెరువు తుమును పట్టించుకునే వారే లేరా

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మీడియా /వరంగల్ రూరల్ నెక్కొండ/జూన్5:
నాగారం పెద్ద చెరువు తుమును పట్టించుకునే వారే లేరా?

మండలం కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారం గ్రామానికి పెద్ద చెరువు తూము సమస్య ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను ఆధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. గత సంవత్సరం కాలం పాటు చెరువు తూము తలుపు పడక నీరు చేరువలో నిల్వ ఉండటంలేదు కొంత మంది రైతులు ఆదికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు, వారు సానుకూలంగా స్పందించి యాశంగి పంటల కోసమైనా నీటిని నిల్వ చేయాలని, గ్రామ రైతులు, జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో ఆధికారులు ప్రయత్నం చేసిన సమస్య సున్యంగానే మిగిలిపోయింది. అప్పట్లో గ్రామ రైతులు కొందరు నాగారం గ్రామ ఆడపడుచు, నల్లబెల్లి జెడ్పీటీసీ, వరంగల్ రూరల్ జిల్లా ఫ్లోర్ లీడర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. యాసంగి వరి నాట్లు దగ్గర పడటంతో చెరువులో నీరు నిలిచే సమస్య తీరలేదు. చెరువులో ఉన్న నీరు యసంగి పంటలకు సరిపోదు కనుక మళ్ళీ రైతులు పెద్ది స్వప్న నీ కోరగా, ఏ ఈ, డి ఈ.లతో మాట్లాడి కేనాలి నీటిని చెరువులోకి తెచ్చి పంటలను కాపాడారు. నామ మాత్రంగా పంటలు పండించిన తృప్తి లేకుండా తూము సమస్య రైతులకు తీరని సమస్య లాగే మిగిలిపోయింది. ఈ సమస్య ఈలానే కొనసాగితే బుక్కెడు అన్నం పెట్టే రైతన్నలకు తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కరోనా విజృంభిస్తు,విలయతాండవం చేస్తు ప్రజల జీవితాలలో చీకట్లు నింపుతున్న సమస్య ఒకటి అయితే, చెరువులో నీరు నిలవని సమస్య ఇంకొకటి. ఒక్క రైతు పంట పండించకపోతే పొలం ద్రున్నే ట్రాక్టర్ యజమాని, రోజువారీ కూలీలు, నాటువేసి, కలుపు తీసే మహిళ కూలీలు తీవ్రంగా నష్టపోతారు. చెరువులో నీరు నిల్వలేకపోతే ముదిరాజులు జీవనోపాధి కోల్పోయి, చేపల పెంపకం నిలిచిపోతుంది. ప్రాణంతో ఉన్న ప్రతి మనిషి, జీవరాశికి నీరు ప్రధానం కనుక మనుషులకు, పశువులకు నీటి సమస్య తువ్రంగా ఏర్పడుతుంది. ఈ పెద్ద చెరువు క్రింద సుమారుగా 260 ఎకరాల వరి పొలాలతో రైతులు జీవనోపాధి పొందుతున్నారు. సుమారుగా గ్రామ ప్రజలు అందరు ఈ పెద్ద చెరువు నీటితోనే అంటే, త్రాగటానికి, రైతుల పంటలకు, జీవరాశికి, పశువులకు ఈ చెరువు నీరుజీవనాధారం. ఈ సారి ఒక పంట నష్టం జరిగితే సుమారుగా 60 నుండి 70 లక్షల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేసిన ఉన్న సమస్యని గ్రామ పాలక వర్గం ప్రభుత్వం, ఆధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యని పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామ పెద్ద చెరువు తూము సమస్యని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని గ్రామ రైతులు కోరుకుంటున్నారు. సమస్యని వారి దృష్టికి తీసుకువెళ్లితే కచ్చితంగా ఒక ప్రణాళికతో సమస్యని సునాయాసంగా పరిష్కరిస్తారని గ్రామ రైతుల ఆలోచన.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.