వాహన పార్కింగ్ సరిచేయండి

అస్తవ్యస్తంగా ఉన్న

0
TMedia (Telugu News) :

ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కు వినతి పత్రం ఇచ్చిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ

టీ మీడియా ప్రతినిధి// గోదావరిఖని,జూలై 20

s s consultancy

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన చౌరస్తా నుండి లక్ష్మినగర్, మెదరి బస్తి, ఓల్డ్ అశోక్, కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి అడ్డగుంటపల్లి వరకు వాహనదారులు తమ అవసరాల కోసం వచ్చి ఇష్టం ఉన్నట్లు పార్కింగ్ చేయడం,మరియు షాపుల యజమానులు, అందులో పనిచేసే వారు కూడా పార్కింగ్ చేయడం వలన లక్ష్మీనగర్ అంత గందరగోళంగా మారి పార్కింగ్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్, సి హెచ్ వివేక్,మండల శ్రీనివాస్,మంగళవారం ఖని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిఐ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చి పలు సమస్యలు వారి దృష్టికి తిసుకెళ్లడం జరిగింది.

Also Read:అంకితభావంతో పనిచేసే వ్యక్తి నరసింహులు

ముఖ్యంగా ప్రజలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఖనిలోని లక్ష్మీనగర్ లోని ఆస్పత్రులకు వద్దాం అంటేనే భయపడే విధంగా, అస్తవ్యవస్థ పార్కింగ్ లతో కనీసం ఆటోలు,కానీ అంబలెన్సు,లు కూడా పోలేని పరిస్థితి, ఉందని మీకు వారికి తెలియజేసారు.రామగుండం నగర పాలక నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏర్పాటు ఏర్పాటు చేసే దిశగా చూడాలని మరియు అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగిందన్నారు.వీలైతే వివిధ షాప్ ల యజమానాయలు అందులో పనిచేసే వారితో ట్రాఫిక్ సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి సుచనలు మరియు అధికారులు సూచనలు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వివరించడం జరిగింది.అదే విధంగా రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఉదయ్ కుమార్ (ఐఏఎస్)కు కూడా విన్నవించడం పార్కింగ్ స్థలాల్లో పటిస్టమైన భద్రత, మరియు సిసి కెమెరాలు, ఒక ఇద్దరు వాచ్ మెన్ ల ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
వారు కూడా సానుకూలంగా స్పందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.