రస్తోగినగర్ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. మేయర్

0
TMedia (Telugu News) :

ఆరో డివిజన్లో పర్యటించిన మేయర్, డిప్యూటీ మేయర్ రస్తోగినగర్ నగర్ ఇండ్ల మధ్యనుండి వెళ్లే మురుగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం…మేయర్
అలుగు కాలువ పూడికతీత పనుల పట్ల సంతృప్తి
ఖమ్మం, మే22.. ఆరో డివిజన్ లోని రస్తోగినగర్ ప్రజలు వానాకాలంలో పోటెత్తే మురుగునీటితో సుదీర్ఘ కాలం నుండి పడుతున్న ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని మేయర్ పునుకుళ్ల నీరజ అన్నారు.
ఖమ్మం నగరం లోని అరో డివిజన్లో  శనివారం నగర మేయర్ పునుకొళ్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు డివిజన్ లోని రస్తోగినగర్ ప్రాంత వాసులు వానాకాలంలో మురుగునీరు కాలనీ ఇండ్లలోకి పోటెత్తడంతో పడుతున్న తీవ్రమైన ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు వారు సమస్య పరిష్కారానికి గాను కార్పోరేటర్ కోటేశ్వరరావు తో చర్చించారు. విజయనగర్ కాలనీ, బ్యాంకు కాలనీ, వేణుగోపాల్ నగర్-1 ప్రాంతాలనుండి వానాకాలంలో మురుగునీరు భారీగా వచ్చినపుడు రస్తోగి నగర్ ఇండ్లలోకి మురుగునీరు పోటెత్తి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు బైపాస్ రోడ్ నుండి అలుగుకాలువకి సైడ్ డ్రైన్ నిర్మిస్తే రస్తోగినగర్ కు మురుగునిటి సమస్య పరిష్కారం అవుతుందని కార్పోరేటర్ కోటేశ్వరరావు మేయర్, డిప్యూటీ మేయర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన వారు సానుకూలంగా స్పందించారు. అనంతరం స్థానిక కార్పోరేటర్ కోటేశ్వరరావు ఇటీవల చేపట్టిన అలుగు కాలువ పూడికతీత పనులను వారు పరిశీలించారు. త్వరిత గతిన జరిగిన పూడికతీత పనులను బట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎస్ నాయకులు వడ్డె రమేష్, కృష్ణా రెడ్డి, చంద్రశేఖర్, ముక్తార్, తదితరులు పాల్గొన్నారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.