బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి

0
TMedia (Telugu News) :
s s consultancy

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి
ఆదిలాబాద్ జిల్లా : సిరికొండ/మే (22)సిరికొండ మండలం లోని చిమ్మన్ గూడ గ్రామానికి చెందిన జాధవ్ జీజాబాయి (40) శుక్రవారం ఉదయం కిరణ షాప్ లో విద్యుత్ షాక్ తో సజీవ దహనం అవ్వగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరిబాయి గారు శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ జీవనం గడవడానికి కిరణ నడుపుతున్న మహిళ చనిపోవడం బాధకరమని ఆమె అన్నారు.ఉన్న ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు వికలాంగులుగా ఉన్నారని అలాగే బాధితురాలి భర్త కూడా ఆమెను కాపాడే ప్రయత్నంలో అర్ధ శరీరం కాలిపోయి ఎటువంటి పని చేయకుండా అయ్యిందని అన్నారు. కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా నిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.