మావోయిస్ట్ తండ్రిఆరోగ్య స్థితిని స్వయంగావెళ్లితెలుసుకున్న ఏఎస్పీ

0
TMedia (Telugu News) :
s s consultancy

నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ DVCM క్యాడర్లో పనిచేస్తున్న వెక్కటి సీతారామిరెడ్డి భార్య తండ్రి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న మణుగూరు ఏఎస్పీ డా.శబరీష్ ఐపీఎస్.

అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంలో నివాసముంటున్న వెక్కటి సీతారామరెడ్డి తండ్రి వెక్కటి సత్యనారాయణ మరియు భార్య సీతమ్మల ఆరోగ్య సమాచారాన్ని మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారికి దుస్తులను మరియు పండ్లను అందజేశారు.కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నిషేధిత మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమిటీ మెంబెర్ గా పనిచేస్తున్న వెక్కటి సీతారామిరెడ్డి వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి మరియు భార్య వద్దకు చేరి వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తనయుడి రాక కోసం ఎదురు చూసి చూసి రెండేళ్ల క్రితం అతని తల్లి మరణించారని ఈ సందర్భంగా తెలియజేసారు.ఇప్పటికైనా మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవనం గడపాలని కోరారు.ఎన్నో ఏళ్లుగా తన కొడుకు వెక్కటి సీతారామిరెడ్డి రాక కోసం తండ్రి సత్యనారాయణ మరియు భార్య సీతమ్మ ఎదురు చూస్తున్నారని అన్నారు.బూజుపట్టిన మావోయిస్ట్ సిద్ధాంతాలను వదిలేసి పోలీసువారికి లొంగిపోయి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరారు.లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం నుండి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందేలా పోలీస్ శాఖ తరఫున హామీ ఇస్తున్నామని తెలిపారు. మహమ్మారి కరోనా బారినపడి మావోయిస్ట్ పార్టీలోని నాయకులు మరియు సభ్యులు సరైన వైద్యం అందక చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రనాయకుల నిర్లక్ష్యం వల్లనే కిందిస్థాయి క్యాడర్ కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారని, పోలీసువారి ఎదుట లొంగిపోయి మెరుగైన వైద్య చికిత్సను పొందాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.