కనకమేడల కు ఎంపీ నామ పరామర్శ

0
TMedia (Telugu News) :
s s consultancy

కనకమేడల కు ఎంపీ నామ పరామర్శ

ఖమ్మం,జూన్ 9 : ఖమ్మం ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి, టిఆర్ ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ అత్త గారు కొల్లి మహాలక్ష్మీ గుండెపోటుతో మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం
పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. ఎంపీ నామ బుధవారం రాత్రి వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తో కలిసి మృతురాలి ఇంటికెళ్లి, ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి,
శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. మృతురాలి కుమారులు కొల్లి జగన్మోహన్ రాయ్, కొల్లి మిత్రరాయ్
, అల్లుళ్లు కనకమేడల సత్యనారాయణ, సూరపనేని శేషుకుమార్, కూతుళ్లను ఎంపీ నామ పరామర్శించి,ఓదార్చి, ధైర్యం చెప్పారు. మహాలక్ష్మీ ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల స్కూల్ అధినేత సూరపనేని శేషుకుమార్, కిరణ్ గ్యాస్ అధినేత కొల్లి కిరణ్ , నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ ,
గోపీ తదితరులు పాల్గొన్నారు.కనకమేడల కు ఎంపీ నామ పరామర్శ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.