కరోనాతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన అడ్లూరి లక్ష్మణ్

0
TMedia (Telugu News) :

కరోనాతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన అడ్లూరి లక్ష్మణ్

s s consultancy

కరోనాను తక్షణమే ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో చేర్చాలి

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా,మే 23

ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామంలో ఇటీవలే కరోనా వ్యాధితో చనిపోయిన ముక్కెర రాజలింగు కుటుంబాన్ని మరియు గటికే లింగన్న కుటుంబమును ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
అనంతరం అడ్లూరి మాట్లాడుతూ కరోన వ్యాధి తో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని,ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు ఎదుర్కొoటున్నారని,తక్షణమే ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలని అన్నారు.ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ధర్మపురి ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వైద్య నిపుణల పర్యవేక్షణలో ఐసోలేషన్ సెంటర్,ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.వీరి వెంట వేముల రాజేష్,అశెట్టి శ్రీను,మోగిలి,ఆవుల శ్రీను తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.