పంచాయతీ రాజ్ శాఖకు సీఎం కెసిఆర్ అభినందన:ఎర్రబెల్లి

0
TMedia (Telugu News) :

హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేసి తనను భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్ కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తెలంగాణలో నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేశారనిఅన్నారు. కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖను ముఖ్యమంత్రి అభినందించిన నేపధ్యంలో ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దళిత బంధు, రైతు బంధు, రుణమాఫీ, గొర్ల, మేకల పంపిణీ తో సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరుగుతోందన్నారు. మంత్రి వర్గ సమావేశంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుందని, మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారడానికి కృషి చేసిన అధికారులను, మంత్రిని కేసీఆర్ అభినందించారు.

s s consultancy

పల్లె ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేసి తనను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం అభినందన స్ఫూర్తి ని కొనసాగిస్తామని మంత్రి చెప్పారు.అయితే, దళిత బంధు ద్వారా దళితులకు, గొర్రెల పంపిణీ ద్వారా గొల్లకుర్మలకు, చేపల పంపిణీ ద్వారా మత్స్య కార్మికులకు ఇలా చెప్పుకుంటూ పోతే చేనేత కార్మికులకు చేనేత బంధు లాంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం కెసిఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయం అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

50 వేల లోపు రుణ మాఫీ ని ఈ ఆగష్టు 15 నుంచి అమలు చేస్తున్నారని, అందువల్ల రాష్ట్రంలోని 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి చెప్పారు. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. దీంతో ఈడబ్ల్యూఎస్‌ వారికి లబ్ధి చేకూరుతుందని మంత్రి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.