పంచనామ నివేదిక పదిలం:రికార్డులు తారుమారు చేసి “రియల్” అమ్మ కాలు

0
TMedia (Telugu News) :

పంచనామ నివేదిక పదిలం:రికార్డులు తారుమారు చేసి “రియల్” అమ్మ కాలు

(టీమీడియా నిఘావిభాగం)

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళచేరువు లో 1996 లో ప్రభుతం స్వాధీనం చేసుకున్న .పంచనామా నివేదిక 2 పేజీలు పదిలంగా ఉన్నాయి.. హద్దులు తో కూడిన మ్యాపులు టీమీడియా సేకరించింది.. ఈ భూమిలో కొంత భాగం కొనుగోలు చేసిన వారి లో ఖమ్మం నగరం లో నివాసం ఉండే ఒక డాక్టర్ ,రియల్ వ్యాపారి కొనుగోలు చేసినట్లు గా తెలుస్తోంది.మొత్తం 27.32 ఎకరాలు ఆనాడు స్వాధీనం చేసుకున్నారు.అప్పటికే కొంత మంది ఆ భూమిలో సాగుదారులు గా ఉన్నారు. అయిన ఆనాటి మండల రెవిన్యూ ఇంస్పెక్టర్ అమరగాని గోపయ్య, అయితగాని పుల్లయ్య ,అంబాల వీరభద్రం అనే వారు పంచనామా లో సాక్షులు గా పేర్కొన్నారు.వీర భద్రం మినహా మిగిలిన వారు చనిపోయారు..

వీరభద్రం సంతకాలు ఫోర్జరీ చేసి పాస్ బుక్కులు

s s consultancy

సిలింగ్ భూమీ పంచనామా లో సాక్షం సంతకం చెసిన అంబాల వీరభద్రం కుసుమంచి పోలీస్ లకు తన సంతకము ఫోర్జరీ చేసి తాను పుట్టక ముందే భూమి కొను గోలు చేసి అమ్మినట్లు తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేశారని,సర్వే నెంబర్ 354 1.04 ఎకరాలు కు మడురి వెంక ట్రమ నరసయ్య అనే అతనికి తాను భూమి అమ్మినట్లు సృష్టించిన డాక్యుమెంట్లు తో రేవిన్యూ అధికారులకు పిర్యాదు చేసిన పత్రం కాపీ టీమీడియా కి అందింది.354 సర్వే నెంబర్ సిలింగ్ కేసులో ఉంది..ఈ భూమి అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది.

సిలింగ్ భూమిలో వెంచర్

 1996 లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సిలింగ్ భూమి 358,359 లో హద్దులు  ఒకటి సర్వే నెంబర్ వేరే పట్టాదారు ది పొరపాటున ఆనాడే నమోదు అయింది.ఈ వివాదం కోర్టు పరిధి లో ఉంది విచారణ సాగుతోంది.అవి ఏమి పట్టించు కోకుండా

పంచ నామ రిపోర్ట్ పెక్కన పెట్టి సర్వే నెంబర్ తో అధికారులు పాస్ బుక్కులు జారీ చేశారు.అందులో ప్రస్తుతం రియల్ వెంచర్ వెలిసింది.. ఈ వెంచర్ కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు.కనీసం ల్యాండ్ కన్వర్షన్ లేదు.ఆయన విక్రయాలు జరిగి పోయాయి..లక్షలు చేతులు మారాయి.

      సిలింగ్ భూమి ఇదే
     ---

జీళ్ళచేరువు రెవిన్యూ లోని..సర్వే నెంబర్ 341,342ఆ,343,354,358,359,602,603,604,605,606,611 సర్వేనెంబర్లు లలో 27 ఎకరాలు 32 కుంటలు ఉంది .అయితే ప్రస్తుత రెవిన్యూ రికార్డు ల్లో చాలా వరకు ప్రవైట్ అన్నట్లు ఉంది.(మరికొన్ని వివరాలు మరో ఎపిసోడ్ లో)


for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.