నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మేము సైతం హెల్పింగ్ సొసైటీ సభ్యులు

0
TMedia (Telugu News) :

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మేము సైతం హెల్పింగ్ సొసైటీ సభ్యులు

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 20) జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజ్ పల్లి గ్రామంలోని నిరుపేద
కుటుంబానికి చెందిన కాముని రాజశేఖర్(30) కరోనా వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులు పడి భాదపడుతూ జగిత్యాల లోని ప్రభుత్వం దవాఖాన లో కోవిడ్ చికిత్స కోసం వెళ్లి గత పదిహేను రోజులు గా చికిత్స తీసుకొని నెగిటివ్ రిపోర్ట్ రాగానే ఇంటికి వచ్చారు.అయితే ఇంట్లొ తిండికి లేక ఇబ్బంది పడుతున్నామని చేతిలో చల్లి గవ్వ లేదని వారి భార్య బాధపడుతు మేము సైతం టీమ్ కు తెలిపారు.అలాగే భర్త దినసరి కూలి అని కోవిడ్ కారణంగా మేము ఏమి పని చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఎవరైనా దాతలు ఆదుకోవాలని కోరారు.వారి పరిస్థితి మేము సైతం సభ్యుల గ్రహించి మీకు మేము అండగా ఉంటామని ఏ అవసరం ఉన్న మాకు ఫోన్ చేయండని, వారికి ధైర్యం చెప్పి మందులు మంచిగా వాడండని,ఏమైనా మందులు అవసరం ఉంటే మాకు చెప్తే మందులు కూడా ఉచితంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం జరిగిందని అన్నారు.వారికి 25 కిలోల బియ్యం,రెండు లీటర్ల పల్లినూనె,గోధుమపిండి, కిలోరవ్వ,కిలోచక్కెర,టి పొడి, సబ్బులు తదితర వస్తువులు ఒక నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు వారికి అందించారు.ఈ కార్యక్రమంలో మేము సైతం హెల్పింగ్ సొసైటీ సభ్యులు పెంబి మహేందర్,ఆలిశెట్టి గంగాధర్,నేవురి శ్రీధర్, కటిపెళ్లి ప్రశాంత్ రెడ్డి,గడ్డం నవీన్ రెడ్డి,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.