కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

0
TMedia (Telugu News) :
s s consultancy

మీడియా ప్రతినిధి
కొడిమ్యాల మే 19
జగిత్యాల జిల్లా లో మెడికల్ కాలేజ్ కేటయింపు పై హర్షం వ్యక్తం చేస్తూ ఆదర్శ గ్రామం హిమ్మత్ రావుపెట్ లో సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు కృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావుపెట్ గ్రామం లో జగిత్యాల జిల్లా లో ప్రజాఆశీర్వాద సభలో ఇచ్చిన మాట జగిత్యాల కి మెడికల్ కాలేజీ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు మరియు కాలేజీ ఏర్పాటు లో కృషిచేసిన జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు ఏమ్మేల్సి కవిత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మరియు జగిత్యాల జిల్లా పరిధిలోని ఏమ్మేల్యే లకు చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ లకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు , ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మరియు చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి చిత్రపటాలకు హిమ్మత్ రావు పెట్ గ్రామపంచాయతీ తరపున పాలాభిషేకం నిర్వహించారు .ఈ సందర్బంగా కృష్ణారావు మాట్లాడుతూ జగిత్యాల ను జిల్లా గా ప్రకటించడమే కాక మెడికల్ కాలేజీ కేటయించడం జగిత్యాల జిల్లా ప్రజల వరమని జిల్లా ప్రజలకు విద్య వైద్య సేవలు చేరువ అవుతాయని తెలిపారు , ఈ కార్యక్రమం లో సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు తో పాటు టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఏండి అక్బర్ , తిర్మలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్ ,ఐలయ్య నాయకులు ఆకునూరి మల్లయ్య , విద్యసాగర్ రావు , శ్రీధర్ , వేణు , బోలుమల్ల గంగరాజం పడిగల దేవయ్య తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.