అప్సర రాణి అందుకే పరిమితమా..

0
TMedia (Telugu News) :
s s consultancy

అప్సర రాణి అందుకే పరిమితమా..?
అప్సర రాణి కేవలం ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితమా..ఆర్జీవీ సినిమాలలో బోల్డ్ పాత్రల్లోనే నటిస్తుందా..ఇప్పుడు చాలామంది ఇలాంటి చర్చలే సాగిస్తున్నారట. ఈమె అసలు పేరు అంకితా మహారాణ. 2019లో ‘4 లెటర్స్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమయింది. ఆ తర్వాత ‘ఊల్లాల ఊల్లాల’ సినిమా చేసింది. రెండు సినిమాలు చేసినా ఈమె ఎవరో ఎవరికీ అంతగా తెలియలేదు. కానీ ఎప్పుడైతే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ అప్సర రాణి అంటూ పేరు మార్చి తన మార్క్ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘థ్రిల్లర్‌’తో పరిచయం చేశాడో ఓవర్ నైట్ స్టార్ అనేంతగా క్రేజ్ వచ్చింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ దృష్టి అప్సర మీదా బాగా పడింది. ఈ క్రమంలోనే మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో ‘భూమ్ బద్దల్’ సాంగ్ చేసి బాగా పాపులరయింది. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్ అంటే స్టార్ హీరోయిన్ లేదా ముంబై బ్యూటీస్ ఉండాలని ఆలోచించే మేకర్స్ ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

దీని కారణంగానే గోపీచంద్ – తమన్నా నటించిన ‘సీటీమార్’ సినిమాలో కూడా అప్సర రాణికి ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. అంతేకాదు మరికొన్ని సినిమాలలోనూ ఐటెం సాంగ్స్‌కు తన పేరునే పరిశీలిస్తున్నారట. ఒకవైపు ఇలా ఐటెంస్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు వర్మ రూపొందిస్తున్న ‘డేంజరస్‌’ లాంటి బోల్ద్ మూవీలో నటిస్తోంది. ఇందులోనూ ఈమె ఘాటుగా కనిపించబోతోంది. అయితే అప్సర రాణిలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ బాగా ఉన్నాయని..యంగ్ హీరోలకి మంచి జోడీ అనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదా, లేక తనకే హీరోయిన్‌గా నటించే ఉద్దేశ్యం లేదా అనే విషయంలో ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. అప్సరను మాత్రం మంచి కమర్షియల్ హీరోయిన్‌గా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారట. చూడాలి మరి ఈమెకి ఫ్యూచర్‌లో సోలో హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయో లేదో.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.