ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్.. కలెక్టర్

0
TMedia (Telugu News) :

మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

s s consultancy

టీ మీడియా,జూన్ 6,మధిర:
మధిర పట్టణంలోని శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మధిర ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసినటివంటి ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ…..మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి మనసుతో సత్య సాయి సేవా సమితి పార్టీ చేసినటువంటి ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది అని, ఇవే కాకుండా గతంలో కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదాన సేవా కార్యక్రమాలు మరెన్నో సత్యసాయి సేవా సమితి వారు చేపడుతున్నారని భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ గారు మాట్లాడుతూ….. మధిర ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంచి అభివృద్ధి చెందింది అని,సత్య సాయి సేవా సమితి వారి సేవలు అమోఘమని, గతంలో కూడా సత్యసాయి సేవలు ఎన్నో విన్నాను ఆని, ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో సేవ చేసే వారికి పుణ్యం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా, ఎంపీపీ లలిత,మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు సత్యసాయి సేవా సమితి సభ్యులు కోన మోహన్ రావు, సుధాకర్,మురళీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ డాక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.