నూతన భవనంలో జోయ నర్సింగ్ హోం ప్రారంభం

0
TMedia (Telugu News) :
s s consultancy

నూతన భవనంలో
జోయ నర్సింగ్ హోం ప్రారంభం

ఖమ్మం, జూన్, 4:
నగరంలోని బాలాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన భవనంలో జోయ నర్సింగ్ హోం ఘనంగా ప్రారంభమైంది. ఆసుపత్రి భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. మొదటి అంతస్తును సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ప్రారంభించగా… ఆపరేషన్ థియేటర్ ను ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ పి. శోభాదేవి, పేషెంట్ వార్డు బ్లాక్ ను ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం… ఆధునిక వైద్య సేవలు అందించేందుకు నూతన భవనం దోహద పడుతుందని ఆకాంక్షించారు. నగర ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యం కోసం ఇకపై సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అన్ని రకాల సదుపాయాలు సమకూర్చడం సంతోష దాయకమన్నారు. జోయ ఆసుపత్రి డాక్టర్ నైమా సుల్తాన మాట్లాడుతూ.. గత 6 సంవత్సరాలుగా తమ ఆసుపత్రి ద్వారా మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించామని.. ఇకపై ఐవీఎఫ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు ఎం.డి. రబ్బానీ, టీఎన్జీవోస్ జిల్లా నాయకులు ఎస్. కె. అఫ్జల్ హసన జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ ఇలియాస్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, జకాత్ ట్రస్ట్ ప్రతినిధి అబ్దుల్ మలిక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.