కోవిడ్ సహాయ కేంద్రం ప్రారంభించిన ములుగు ఏ ఎస్ పి

0
TMedia (Telugu News) :

కోవిడ్ సహాయ కేంద్రం ప్రారంభించిన ములుగు ఏ ఎస్ పి

s s consultancy

టీ మీడియా మే 10
ములుగు జిల్లా ప్రతినిధి

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ నందు ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రం లో ఆసుపత్రికి వచ్చే ప్రజల సహాయార్థం ప్రతిరోజు 24 గంటల పాటు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తారు. విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ప్రతిరోజు వైద్య సిబ్బంది సూచనలు కరోనా వ్యాధిగ్రస్తులకు తెలియజేస్తారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్,కోవిడ్ వార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకొని ఆసుపత్రికి వచ్చే ప్రజలకు పోలీస్ సిబ్బంది తెలియజేస్తారు. ప్రజలకు భరోసా కల్పించడం కొరకు మరియు ఎటు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఈ సహాయ కేంద్రం ఉపయోగపడుతుంది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఎం& హెచ్ ఓ శ్రీA.అప్పయ్య గారు,సీఐ శ్రీ జి.శ్రీధర్,ఎస్ ఐ శ్రీ ఓంకార్ యాదవ్, శ్రీ ఫణి,వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.