పోలిసులని ఆశ్రయించిన వృద్ద దంపతులు

0
TMedia (Telugu News) :
s s consultancy

. పోలిసులని ఆశ్రయించిన వృద్ద దంపతులు..

టీ మీడియా, కోనరావుపేట, జూన్8:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన శ్రీరాముల సత్తవ్వ రామయ్య వృద్ధ దంపతులు తమ కొడుకులు తమకు తిండి పెట్టడం లేదంటూ మంగళవారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమకు ముగ్గురు కొడుకులు ఉండగా, ఒక కొడుకు మాత్రమే తమ బాగోగులు చూసుకుంటున్నాడని, మిగతా ఇద్దరు తమని పట్టించుకోవడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుండి ఒక్క కొడుకు మాత్రమే తమకు తిండి పెడుతున్నాడని, మిగతా ఇద్దరినీ అడిగితే తిడుతూ మీరు ఎక్కడన్నపోండి అంటూ నానా మాటలు అంటున్నారని ఆ దంపతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కోనరావుపేట మండలం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, ఎసై రాజశేఖర్ పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తానని మాట్లాడుతూ వృద్ధులను గాని తల్లిదండ్రులను గాని ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.