తులకు ఆయిల్ ఫామ్ సాగుతో ఆదాయం పుష్కలం

0
TMedia (Telugu News) :

తులకు ఆయిల్ ఫామ్ సాగుతో ఆదాయం పుష్కలం

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,జూన్ 8:

s s consultancy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామింగ్ సాగుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 8398 ఎకరాలు ఆయిల్ ఫామింగ్ సాగుకు ఉపయోగపడే విధంగా ఉందని ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ వెల్లడించింది.

జిల్లాలో FGV PU ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపని వారు ఆయిల్ ఫామింగ్ నిర్వహించనున్నారు.

ఈవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయిల్ ఫామింగ్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ ఆయిల్ ఫామింగ్ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తుంది, ఈ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి కూడా ప్రవేశపెట్టింది. దీనిలో మంచి దిగుబడి వస్తుంది. మొదటి పంట దిగుబడి వచ్చే మూడున్నార సంవత్సరాల కాలంలో అంతర్ పంటలు కూడా అనగా కూరగాయలు మొదలైన పంటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ ధర రూ 19000/- పైనే ఉంది. ఒక ఎకరాకు 12 నుండి 14 టన్నుల దిగుబడి వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అసక్తి గల రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామింగ్ సాగును చేసుకోవాలని అన్నారు.

ఈ సాగుకు ఉత్సాహం చూపే రైతులు ఒక్క పట్టదారు పాస్ పుస్తకం,1బి సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ ఫోటో లతో సిరిసిల్ల రైతు వ్యవసాయ కార్యాలయంలో సంప్రధించలన్నారు. వివరాలకు 9154864927 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు. దీనివల్ల ఉపాధితొ పాటు ఆదాయా వనరులు పుష్కలంగా ఉంటాయని ఆయన ఒక్క ప్రకటనలొ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.