పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు ~ డీఐజీ దీపక్ కుమార్…..!!!!!

0
TMedia (Telugu News) :

{ ఒడిషా రాష్ట్రం } :
ఒడిషా రాష్ట్రం కటక్ న్యూస్, కటక్ కలహండి ~ కొంధమాల్ ~ బౌద్ద్ ~ నయాగఢ్ డివిజన్ సీసీఐ ( కేకేబీయన్ ) మావోయిస్టు క్యాడర్ చెందిన సభ్యుడు ఆయత్ కొరస ఆదివారం బొలంగీర్ ఉత్తరాంచల్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్, బొలంగీర్ ఎస్పీ నితిన్ కుశల్కార్ సమక్షంలో లొంగిపోయాడు…. ఈ సందర్భంగా డీఐజీ దీపక్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ….. పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయత్ కు జనజీవన స్రవంతి లో స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందిస్తామని డీఐజీ దీపక్ కుమార్ తెలిపారు… ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మనకేళి గ్రామానికి చెందిన ఆయత్ 2012లో ఉద్యమంలో చేరారాని అన్నారు…. కేకేబీయన్ మావోయిస్టు క్యాడర్ లో ఉంటూ 2020 వరకు ఒడిషా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్లొన్నట్లు ఆయన వెల్లడించారు……..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.